సారీ.. మీ ఆఫర్ నాకొద్దు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే నెల తమ పార్టీలో చేరనున్నారని రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌(ఆర్ఎస్పీ) వ్యవస్థాపకులు మహాదేవ్ జంకర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన సంజయ్ దత్ వాటిని కొట్టిపారేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని సంజూ భాయి స్పష్టం చేశారు. ‘‘ఆర్ఎస్పీ చీఫ్ మహాదేవ్ జంకర్ నాకు మంచి స్నేహితుడు. సోదరుడు లాంటి వాడు. భవిష్యత్‌లో ఆయన అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని సంజయ్ దత్ […]

సారీ.. మీ ఆఫర్ నాకొద్దు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 27, 2019 | 7:09 AM

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే నెల తమ పార్టీలో చేరనున్నారని రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌(ఆర్ఎస్పీ) వ్యవస్థాపకులు మహాదేవ్ జంకర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన సంజయ్ దత్ వాటిని కొట్టిపారేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని సంజూ భాయి స్పష్టం చేశారు. ‘‘ఆర్ఎస్పీ చీఫ్ మహాదేవ్ జంకర్ నాకు మంచి స్నేహితుడు. సోదరుడు లాంటి వాడు. భవిష్యత్‌లో ఆయన అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని సంజయ్ దత్ తెలిపారు. కాగా ఒకప్పుడు ఎస్పీ పార్టీలో ఉన్న సంజయ్.. ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి గత కొన్ని సంవత్సరాలుగా మున్నాభాయి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.