ఎకానమీకి రిజర్వ్ బ్యాంక్ భారీ ‘ సాయం ‘.ఇక ఉజ్వల భారతమే !

మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ భారీ తాయిలాన్నే ఇచ్చింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రూ. 1. 76 లక్షల కోట్లను డివిడెండుగా అందజేయనుంది. ఇది గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే రెట్టింపు నిధులు. ఈ అదనపు నిధుల సాయంతో ఆర్ధిక వ్యవస్థకు ఊపు నివ్వడానికి కేంద్రం నడుం బిగించబోతోంది. ఈ 1. 76 లక్షల కోట్లలో 28 వేల కోట్లను ఇదివరకే ప్రభుత్వానికి బ్యాంక్ బదలాయించింది. ఇక రూ. 1. 48 లక్షల కోట్లను ప్రస్తుత […]

ఎకానమీకి రిజర్వ్ బ్యాంక్  భారీ ' సాయం '.ఇక ఉజ్వల భారతమే !
Follow us

|

Updated on: Aug 27, 2019 | 12:18 PM

మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ భారీ తాయిలాన్నే ఇచ్చింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రూ. 1. 76 లక్షల కోట్లను డివిడెండుగా అందజేయనుంది. ఇది గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే రెట్టింపు నిధులు. ఈ అదనపు నిధుల సాయంతో ఆర్ధిక వ్యవస్థకు ఊపు నివ్వడానికి కేంద్రం నడుం బిగించబోతోంది. ఈ 1. 76 లక్షల కోట్లలో 28 వేల కోట్లను ఇదివరకే ప్రభుత్వానికి బ్యాంక్ బదలాయించింది. ఇక రూ. 1. 48 లక్షల కోట్లను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. దీంతో ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మరిన్ని ఫండ్స్ సమకూర్చేందుకు వీలవుతుంది. మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఈ భారీ డివిడెండ్ ప్రభుత్వానికి దక్కుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులతో కొనసాగుతున్న వేళ.. వృద్ది రేటు క్రమేపీ క్షీణిస్తున్న సమయంలో, వివిధ రంగాల్లో ఉద్యోగాల ఉద్వాసన జరుగుతున్నఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం నిజంగా మోదీ సర్కార్ కు భారీ ఊరటే. ఈ నిధుల బదిలీలో కొన్ని ముఖ్యమైన అంశాలు..

ఆర్బీఐ మిగులు నిధుల్లో రూ. 52, 640 కోట్లున్నాయి. ఈ మొత్తంలో 28 వేల కోట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి బదలాయించారు. నిజానికి ఆర్బీఐ నుంచి 90 వేల కోట్ల డివిడెండ్ రావచ్చునని ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో అంచనా వేసింది. కానీ దానికి మించి నిధులను అందుకుంది. వచ్ఛే ఏడాది మార్చి వరకు మెల్లగా నిధులను విడుదల చేసే బదులు.. తక్షణమే రూ. 70 వేల కోట్లను బ్యాంకులకు రిలీజ్ చేయనున్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అలా ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, నాణేల తయారీలో తను పెట్టిన పెట్టుబడులనుంచి వఛ్చిన లాభాల నేపథ్యంలో ఆర్బీఐ ప్రతి ఏడాది డివిడెండ్ చెల్లిస్తోంది. తన వార్షిక నివేదికలో భాగంగా ఈ బ్యాంకు తన బ్యాలన్స్ షీట్ ను ఈ వారాంతంలో విడుదల చేయనుంది.

రిజర్వ్ బ్యాంకు వద్ద దానికి అవసరమైన దానికన్నా ఎక్కువ మూలధనం ఉందని కేంద్రం భావిస్తోంది. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై అత్యధిక పన్నులను ఉపసంహరిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఇన్వెస్టర్ సెంటిమెంటును పెంచే యత్నంలో భాగంగా లాంగ్, షార్ట్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ పై సర్చార్జీ విధింపు గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఏమైనా.. ఆర్బీఐ తీసుకున్న తాజా చర్య ఫలితం సెన్సెక్స్, స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్