AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా దరఖాస్తులు!

ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ఎలాంటి అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు చెల్లించక్కర్లేదని కేంద్రం 7వ వేతన సంఘం ప్రతిపాదనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సదుపాయం కేవలం దివ్యాంగులకు మాత్రమే. పీడబ్ల్యూడీ కోటా కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై  చేసుకునే వారందరూ ఈ ప్రయోజనం పొందవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ […]

కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా దరఖాస్తులు!
Ravi Kiran
|

Updated on: Aug 27, 2019 | 1:56 PM

Share

ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ఎలాంటి అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు చెల్లించక్కర్లేదని కేంద్రం 7వ వేతన సంఘం ప్రతిపాదనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ సదుపాయం కేవలం దివ్యాంగులకు మాత్రమే. పీడబ్ల్యూడీ కోటా కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై  చేసుకునే వారందరూ ఈ ప్రయోజనం పొందవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.