AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic: ప్లాస్టిక్‌తో సంతాన సమస్యలు.. సంచలన విషయాలు బయటపెట్టిన పరిశోధకులు

ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసినా ప్లాస్టిక్. అసలు ఈ ప్లాస్టిక్ అవసరం లేకుండా మానవ మనుగడ లేదు అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల సమస్యలు తలెత్తె అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ఎవరూ పట్టించుకొని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్లాస్టిక్‌పై పరిశోధనలు చేసిన జాతీయ పోషకాహార సంస్థ పలు కీలక విషయాలను బయటపెట్టింది. శరీరంలోకి ప్లాస్టిక్ చేరినట్లైతే సంతాన సమస్యలు తలెత్తుయాని హెచ్చరించింది.

Plastic: ప్లాస్టిక్‌తో సంతాన సమస్యలు.. సంచలన విషయాలు బయటపెట్టిన పరిశోధకులు
Representative Image
Aravind B
|

Updated on: Sep 13, 2023 | 7:14 AM

Share

ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసినా ప్లాస్టిక్. అసలు ఈ ప్లాస్టిక్ అవసరం లేకుండా మానవ మనుగడ లేదు అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల సమస్యలు తలెత్తె అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ఎవరూ పట్టించుకొని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్లాస్టిక్‌పై పరిశోధనలు చేసిన జాతీయ పోషకాహార సంస్థ పలు కీలక విషయాలను బయటపెట్టింది. శరీరంలోకి ప్లాస్టిక్ చేరినట్లైతే సంతాన సమస్యలు తలెత్తుయాని హెచ్చరించింది. ముఖ్యంగా ప్లాస్టిక్ తయారీలో వినియోగించేటటువంటి.. ‘బిస్ ఫినాల్ ఏ-బీపీఏ’ అనే రసాయనం ప్రభావం వల్ల మగవారిలో సంతాన ఉత్పాదకత దెబ్బతింటుందని వెల్లడించింది. ఇది తమ పరిశోధనలల్లో తేలినట్లు మంగళవారం రోజున జాతీయ పోషకాహార సంస్థ ఓ ప్రకటలనలో తెలిపింది. అలాగే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పాస్టిక్‌లో నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచనలు చేసింది.

అంతేకాదు మహిళలు గర్భం దాల్చినప్పుడు ఒకవేళ వారి శరీరంలోకి ‘బీపీఏ’ వెళ్తే.. వారికి పుట్టే మగ సంతానంలో పెద్దయ్యాక వీర్య నాణ్యత దెబ్బతినొచ్చని హెచ్చరికలు చేసింది. గర్భంతో ఉన్న ఎలుకలను రెండు భాగాలుగా విభజించి పరిశోధనలు జరిపింది ఎన్‌ఐఎన్‌. అయితే ఆ ఎలుకల్లో ఒక భాగానికి పాస్టిక్‌లో ఉండే బీపీఏ తో ముడిపడి ఉన్నటువంటి ఆహారాన్ని అందించింది. ఇక మరో భాగం ఎలుకలకు అలా ప్లాస్టిక్‌తో ముడిపడి ఉన్న ఏ ఆహారాన్ని ఇవ్వలేదు. అయితే ఇందులో తేలిందంటంటే.. బిన్ ఫినాల్ ఏ రసాయనం ప్రభావానికి దూరంగా ఉన్నటువంటి ఎలుకల మగ సంతానంలో వీర్య నాణ్యతను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు జరగలేవు. నాలుగు నుంచి 21 రోజుల పాటు బీపీఓ ఆహాన్ని తీసుకున్నటువంటి ఎలుకలకు పట్టిన మగ మూషికలను పరిశీలించారు. అయితే వాటిలో వీర్య కణాల ఉత్పత్తిలో నాణ్యాత లోపాలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఈ పరిశోధన టీమ్‌కు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డా. సంజయ్ బసక్ ఈ విషయాలను వెల్లడించారు. బీపీఏ పిండ దశలోనే ఎదుగుదల ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే మంచి కొవ్వుకు తయారిలో అవసరమైనటువంటి రసాయనాలను బీపీఏ దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ పరిశోధనా పత్రాన్ని ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ మాలిక్యులర్‌ సైన్సెస్‌’ ప్రచురించింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతిలో కలిసిపోయాయని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డా.హేమలత చెప్పారు. ఈ ప్లాస్టిక్ వర్థాలు పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహరం ద్వారా మానవ శరీరంలోకి మానవ శరీరంలోకి వెళ్లి దుష్ప్రభావాలను చూపుతున్నాయని వెల్లడించారు. అంతేకాదు.. ప్లాస్టిక్ ప్లేట్లు.. ఆహారాన్ని తీసుకెళ్లేందుకు వాడే బాక్సులు, అలాగే తాగునీటి ప్లాస్టిక్ బాటిళ్లకు కూడా ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా గర్భం దాల్చేందుకు సిద్ధమైన మహిళలు.. గర్భం వచ్చాక ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయడం మంచిదని వివరించారు.