AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Goenka: ఇస్రో ఛైర్మన్‌ జీతంపై ఆసక్తికర కామెంట్ చేసిన ప్రముఖ వ్యాపావేత్త హర్ష గోయెంకా.. ఏమన్నారంటే ?

చంద్రాయాన్ 3 విజయవంతం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్తలతో సహా.. ఛైర్మన్ ఎస్‌ సోమనాథ్‌‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఛైర్మన్ సోమనాథ్‌ను సేవలను ప్రశంసిస్తూ ప్రముఖ వ్యాపారవేత్త, ఆప్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయేంకా ట్వీట్ చేశారు. సోమనాథ్ జీతం విషయాన్ని ట్విట్టర్ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ నెల జీతం గురించి తెలిపారు. అసలు ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు.

Harsha Goenka: ఇస్రో ఛైర్మన్‌ జీతంపై ఆసక్తికర కామెంట్ చేసిన ప్రముఖ వ్యాపావేత్త హర్ష గోయెంకా.. ఏమన్నారంటే ?
Harsha Goenka
Aravind B
|

Updated on: Sep 13, 2023 | 8:06 AM

Share

చంద్రాయాన్ 3 విజయవంతం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్తలతో సహా.. ఛైర్మన్ ఎస్‌ సోమనాథ్‌‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఛైర్మన్ సోమనాథ్‌ను సేవలను ప్రశంసిస్తూ ప్రముఖ వ్యాపారవేత్త, ఆప్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయేంకా ట్వీట్ చేశారు. సోమనాథ్ జీతం విషయాన్ని ట్విట్టర్ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ నెల జీతం గురించి తెలిపారు. అసలు ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. అలాగే శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్నటువంటి ఆసక్తి, నిబద్ధత గురించి వివరిస్తూ ఆయన్ని ప్రశంసించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ జీతం నెలకు రెండు లక్షల యాభై వేలు అని తెలిపారు. ఈ జీతం ఆయనకు సరైనదేనా ? న్యాయమేనా అంటూ ప్రశ్నించారు.

సోమనాథ్ లాంటి వాళ్లు డబ్బుల కోసం కాదని.. అంతకు మించినటువంటి మంచి, దేశ ప్రగతి కోసం పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆయన సైన్స్, పరిశోధనల పట్ల అభిరుచి, నిబద్ధతో జాతిని గర్విపజేసేలా.. దేశ అభివృద్ధికి తోడ్పడతారన్నారు. వారికున్న లక్ష్యాన్ని సాధించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను సైతం త్యాగం చేస్తారంటూ అన్నారు. అలాగే ఆయన లాంటి అంకిత భావం ఉన్న వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ రాసుకొచ్చారు. అయితే హర్ష గోవెంకా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎంతోమంది నెటీజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సోమనాథ్‌కు ఎక్కువ శాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలని చెబుతున్నారు. అయితే మరికొంతమంది రెండున్నర లక్షల అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని.. ఇతర అలవెన్స్‌లను కూడా కలపాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇస్రోకు సోమనాథ్ లాంటి వ్యక్తుల నిబద్ధతను డబ్బులతో పోల్చలేనదని మరొకరు అన్నారు. సైన్స్, రీసెర్చ్ పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకితభావం దేశాన్ని ముందుకు నడుపుతోందని ఆయనలాంటి వారు చాలా మందికి ఆదర్శమని అన్నారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనవంటూ ప్రశంసించారు. అలాగే ఇస్రో ఛైర్మన్‌కు నెలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మరొకరు అన్నారు. అలాగే ఆయన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలంటూ మరొకరు అన్నారు.