81 ఏళ్ల వయసులో డిగ్రి పూర్తి చేశాడు..మీ పట్టుదలకు సలాం తాత

మనదేశం తరుపున మూడు యుద్ధాల్లో పొరాడిన ఓ జవాన్ 81 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొందారు. హర్యాణాకు చెందిన లాల్ సింగ్ గోద్రా అనే వృద్ధుడు ఇగ్రో నుంచి బీఏ డిగ్రీ పట్టాను స్వీకరించారు. భారత ఆర్మీలో పనిచేసిన ఆయన 1962,1965,1971 లో యుద్ధాల్లో పాల్గొన్నారు.

81 ఏళ్ల వయసులో డిగ్రి పూర్తి చేశాడు..మీ పట్టుదలకు సలాం తాత
Lal Singh
Follow us
Aravind B

|

Updated on: Apr 04, 2023 | 2:25 PM

మనదేశం తరుపున మూడు యుద్ధాల్లో పొరాడిన ఓ జవాన్ 81 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొందారు. హర్యాణాకు చెందిన లాల్ సింగ్ గోద్రా అనే వృద్ధుడు ఇగ్రో నుంచి బీఏ డిగ్రీ పట్టాను స్వీకరించారు. భారత ఆర్మీలో పనిచేసిన ఆయన 1962,1965,1971 లో యుద్ధాల్లో పాల్గొన్నారు. పదవి విరమణ చేసిన అనంతరం హర్యాణాలోని రవాణా శాఖలో పనిచేశారు. అందులో నుంచి కూడా రిటైర్ అయ్యాక కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. గతంలో విద్యార్హతలు తక్కువగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు పడినట్లు లాల్ సింగ్ తెలిపాడు. తన మనవళ్లు, మనువరాళ్లను చూసి తాను కూడా చదువుకోవాలనుకున్నాడు. ఇనంతరం ఇగ్రోలో చేరారు. 10,12 వ తరగతులను కూడా ఆయన అక్కడే పూర్తి చేశారు.

అయితే భారత్ తరుపున మూడు యుద్ధాల్లో పాల్గొన్న ఆయన…ఇప్పటికీ చదువుకోవడానికి వెనకాడటం లేదు. ప్రస్తుతం బీఏ పట్టా తీసుకున్న ఆయన..భవిష్యత్ లో కూడా ఎంఏ చేస్తానని ఆ తర్వాత పీచ్ డీ కూడా పూర్తి చేస్తానని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఇగ్నో 36వ స్నాతకోత్సవ కార్యక్రామానికి వచ్చిన ఆయన తన పట్టాను స్వీకరించారు. అధికారులు ఆయన్ను సన్మానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..