కమీషనర్ కుక్క పోయింది.. 500 ఇళ్లు గాలించిన పోలీసులు ?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మీరట్ పోలీస్ కమిషనర్ సెల్వకుమారీ పెంచుకునే పెంపుడు కుక్క కనిపించకపోవడంతో పోలీసులు 500 ఇళ్లను వెతకడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ రికార్డు ప్రకారం ఆ పెంపుడు శునకం జపాన్ షెపర్ట్ జాతికి చెందింది. అటువంటి జాతి కుక్కలు ఆ నగరంలో కేవలం 19 ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మీరట్ పోలీస్ కమిషనర్ సెల్వకుమారీ పెంచుకునే పెంపుడు కుక్క కనిపించకపోవడంతో పోలీసులు 500 ఇళ్లను వెతకడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ రికార్డు ప్రకారం ఆ పెంపుడు శునకం జపాన్ షెపర్ట్ జాతికి చెందింది. అటువంటి జాతి కుక్కలు ఆ నగరంలో కేవలం 19 ఉన్నాయి. అయితే ఆదివారం సాయంత్రం పూట ఆ కుక్క తప్పిపోయింది. దీంతో కమీషనర్ సెల్వకుమారి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటీన ఆమె నివాసానికి వెళ్లారు . ఆ తర్వాత పోలీసులు ఆ శునకం కోసం దాదాపు 500 ఇళ్లకు పైగా గాలించనట్లు పలు మీడియా కథనాల్లో వచ్చింది. అలాగే జంతువుల సంరక్షణాధికారి హర్పల్ సింగ్ కూడా కమిషనర్ ఇంటికి చేరుకుని, కుక్క ఫొటోను తీసుకుని వెతికినట్లు సమాచారం. దీంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
అయితే ఈ వ్యవహారంపై పోలీస్ కమినక్ సెల్వకుమారి స్పందించారు. తన పెంపుడు శునకంపై చేసిన ఆరోపణలను ఖండించారు. తప్పిపోయిన తన పెంపుడు శునకం నుంచి తప్పుడు వార్తలు వస్తున్నాయని..గేట్ తెరచే ఉండటంతో అది బయటకు వెళ్లిపోయిందని చెప్పింది. అయితే ఆ తర్వాత దాన్ని గమనించిన కొందరు స్థానికులు దాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చారని తెలిపారు. తన కుక్కను ఎవరు దొంగిలించలేదని. ఇప్పటిదాక పోలీసులు కూడా వెతకలేదని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం



