ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు రాకుంటే జీతం కట్
మణిపుర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా సెలవు తీసుకొని విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలను సిద్ధం చేయాలని జీఏడికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మణిపుర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా సెలవు తీసుకొని విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలను సిద్ధం చేయాలని జీఏడికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జీఏడీ నుంచి శాలరీ తీసుకుంటూ అనుమతి లేకుండా విధులకు హాజరుకాకపోతే.. వారి జీతంలో కొంత భాగం కట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాల్లోకి వెళ్తే గత నెలరోజులుగా అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ పనిచేసే సుమారు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు విధలు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎప్పటి నుంచి ఎప్పటిదాక ఈ నిబంధన అమల్లో ఉంటుందని ఇంకా తెలియదు. ఇదిలా ఉండగా మణిపుర్ జరుగుతున్న హింసకాండపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని అనిత్ షా హామీ ఇచ్చినట్లు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ చెప్పారు. ఈ అల్లర్ల కారణంగా కొంతమంది పునరావస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతుంటడగా.. వారిని సీఎం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా చేస్తామన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం