PM Modi: కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోదీ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటవేయాలని.. ప్రజలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన మేరా బుత్ సబ్ సే మజ్‌బూత్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రధాని మోదీ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటవేయాలని.. ప్రజలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన మేరా బుత్ సబ్ సే మజ్‌బూత్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్రంగా విమర్శిస్తూనే విపక్షాల సమావేశాలపై సైతం మండిపడ్డారు. అవినీతి చేసేవాళ్లపై బీజేపీ పార్టీ చర్యలు తీసుకుంటుందని అందుకే 2024లో బీజేపీ గెలవనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఒకేచోటుకు చేరాయని విమర్శించారు.
బీజేపీ కార్యకర్తలే తమ పార్టీకి అతిపెద్ద బలమన్నారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయలా చేయకూడదని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లీం వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందనని పేర్కొన్నారు. కొన్ని పార్టీల నేతలు ఉమ్మడి పౌరస్మృతి పేరుతో ప్రజలను రెచ్చగెట్టే పనికి పూనుకున్నాయని ఆరోపించారు. రెండు వేర్వేరు చట్టాలతో కుటుంబం ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగం కూడా సమాన హక్కులు గురించి చెబుతోందని అన్నారు. పలు ఇస్లామిక్ దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాయన్నారు. కానీ విపక్షాలు మాత్రం ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం
