RK Arora: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ ఆర్‌కే అరోరా అరెస్టు.. అసలు కారణం ఇదే
రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన సూపర్ టెక్ యజమాని, ఛైర్మన్ ఆర్‌కే అరోరా అరెస్టయ్యారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు మంగళవారం ఆయన్ని అరెస్టు చేశారు. ఇప్పటికే అరోడాను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రెండు సార్లు విచారించారు. ఇప్పుడు తాజాగా మూడోసారి విచారించారు. విచారణ అనంతంరం మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయన అరెస్టు చేశారు

రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన సూపర్ టెక్ యజమాని, ఛైర్మన్ ఆర్‌కే అరోరా అరెస్టయ్యారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు మంగళవారం ఆయన్ని అరెస్టు చేశారు. ఇప్పటికే అరోడాను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రెండు సార్లు విచారించారు. ఇప్పుడు తాజాగా మూడోసారి విచారించారు. విచారణ అనంతంరం మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయన అరెస్టు చేశారు. వివిధ రకాల స్థిరాస్తి స్కీమ్‌ల పేర్లతో సొమ్ములు వసూలు చేయడంపై ఈడీ అధికారులు అరోడాను విచారణ చేసినట్లు తెలుస్తోంది.
అయితే బుధవారం రోజు అరోడాను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఆ తర్వాత తదుపరి విచారణ కోసం రిమాండ్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హర్ణాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్‌లు ధాఖలు చేశారు. అయితే వీటి ఆధారంగానే సూపర్‌టెక్ గ్రూప్, ఆ సంస్థ నిర్వాహకులపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వారిపై కేసు నమోదు చేసింది. ఏప్రిల్ లో ఈ స్థిరాస్తి గ్రూప్ సంస్థ డైరెక్టర్లకు చెందిన రూ.40 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.



