Tomato: ఆకాశాన్ని తాకుతున్న టమాటా ధరలు.. పెరుగుదల తాత్కలికమేనంటున్న ప్రభుత్వ వర్గాలు
దేశంలోని పలు నగరాల్లో కిలో టమాటా ధరలు కిలో రూ.100 దాటడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యావసర ధరల్లో కీలకమైన టమాట ధరలు ఇంత మొత్తంలో పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు.

దేశంలోని పలు నగరాల్లో కిలో టమాటా ధరలు కిలో రూ.100 దాటడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యావసర ధరల్లో కీలకమైన టమాట ధరలు ఇంత మొత్తంలో పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. టమాట ధరలు పెరగడం తాత్కాలికమేనని.. మళ్లీ త్వరలోనే ధరలు తగ్గుతాయని వెల్లడించారు. టమాటాలకు త్వరగా పాడైపోయే లక్షణం ఉంటుందని.. ప్రస్తుతం దేశంలో వర్షాలు కురవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. ఈ సమస్య కొద్దిరోజుల వరకే ఉంటుందని ఆ తర్వాత ధరలు మారిపోతాయని తెలిపారు.
ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 27 వ తేదిన దేశంలో టమాట సగటు ధర కిలో 46 రూపాయలు ఉంది. అయితే గరిష్ఠంగా ధర రూ.122 ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా వెల్లడించింది. ఢిల్లీలో టమాట ధర రూ.60 కాగా, జమ్మూలో రూ.80, కోల్‌కతాలో రూ.75 ఉన్నాయి. అలాగే భువనేశ్వర్‌లో రూ.100, రాయ్‌పూర్ రూ. 99 ఉంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, కర్ణాటకలోని బళ్లారిలో కిలో టమాటా ధర రూ.122 ఉన్నట్లు డేటాలో పేర్కొంది. అయితే టమాటాలు పండించే కీలక రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని.. వీటివల్ల సరఫరా వ్యవస్థకు అంతరాయం జరుగడం వల్లే ధరలు పెరిగినట్లు అధికారులు తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం