Discount Offers: Zepto, Blinkitలలో ఆర్డర్ చేస్తున్నారా..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే 40 శాతం వరకు ఆదా చేయవచ్చు
సందు దొరికితే చాలు.. ఈ మధ్య కాలంలో ప్రతీది ఆన్ లైన్ షాపింగ్ లోనే కొనుగోలు చేస్తుంటాం. ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ పెట్టేస్తాం. మరి ఈ ఆన్ లైన్ ఆర్డర్లలోనూ డబ్బులు ఆదా చేయాలనుకుంటే.. కచ్చితంగా ఈ ట్రిక్ తెలిసి ఉండాలి. ఓ సారి అదేంటో తెలుసుకోండి.

ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో కొత్త పదం క్విక్ కామర్స్. ఏది కావాలన్నా నిమిషాల్లో మీ ఇంటికి.. Zepto, Blinkit, Big Basket, Instamart ఇలా చాలా మొబైల్ యాప్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. గ్రేటర్ నగరాల్లో ఏ వస్తువు కావాలన్నా పది నిమిషాల్లోనే ఇంటికి తీసుకొస్తున్నారు. కస్టమర్స్ కూడా పెద్ద ఎత్తున వీటికి అలవాటు అయిపోయారు. ఒక్కో ఇంటి నుంచి ప్రతి రోజు నాలుగు ఐదు ఆర్డర్‌లైనా చేస్తుంటారు. అయితే ఈ క్విక్ కామర్స్ వల్ల సౌకర్యం పెరిగింది.. కానీ కస్టమర్ల జేబులు మాత్రం చిల్లులు పడుతున్నాయి.
MRPలు గమనించి కొనండి..
అత్యవసరమైన సామాగ్రి పాలు, పండ్లు, కూరగాయలు, లేదా అప్పటికప్పుడు కావలసిన ఇంగ్రిడియంట్స్ వరకు ఈ క్విక్ కామర్స్ యాప్స్ వాడడం వరకు ఓకే.. కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్స్, చిన్న చిన్న హోమ్ అప్లియన్సెస్, లిమిటెడ్ క్లోతింగ్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. చాలామంది ధరను చూసుకోకుండా వీటిని కొనేస్తూ ఉన్నారు.
ఈ కామర్స్ వర్సెస్ క్విక్ కామర్స్..
సాధారణంగా క్విక్ కామర్స్‌లో ఎక్కడా డిస్కౌంట్ ఉండవు, పైగా హ్యాండ్లింగ్ చార్జిలు, ప్యాకింగ్ చార్జిలు, సర్వీస్ ఛార్జిలంటూ 40 శాతం వరకు ఎక్కువగా బాదడమే ఉంటుంది. అదే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో మంచి డిస్కౌంట్‌తో పాటు ఎలాంటి చార్జీలు లేకుండా వస్తువులను పొందవచ్చు. ఇప్పుడు ఈ కామర్స్ యాప్స్ కూడా స్పీడ్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించాయి. ఉదయాన్నే, లేదా ఆ రోజు రాత్రి కల్లా కొన్ని గంటల్లో డెలివరీస్ ఇస్తున్నాయి. సో.! మీరు కూడా అప్పటికప్పుడు అవసరమైన వస్తువులు తప్ప మిగిలినవన్నీ ఈ కామర్స్‌లో కూడా చూసి కొనండి. కావాలంటే కొన్ని వస్తువులను సెర్చ్ చేసి మీకోసం అందిస్తున్నాం. చిన్నచిన్న పాల ప్యాకెట్ల నుంచి పెరుగు, కూరగాయలు వంటి వాటిని పది రూపాయలు, 15 రూపాయలు తేడా ఉంటాయి. కానీ ఇంకా ఎక్కువ ధర పెట్టే వస్తువుల్లో మాత్రం వందల రూపాయల్లో తేడా కనిపిస్తుంది. సో స్మార్ట్ షాపింగ్ స్టైల్ అలవాటు చేసుకోండి. చిన్న వస్తువులను క్విక్ కామర్స్‌లో, అప్పటికప్పుడు అవసరం లేని వస్తువులను ఈ కామర్స్‌లో కొనడం అలవాటు చేసుకోండి. దీని ద్వారా దాదాపుగా 40 శాతం మీకు కచ్చితంగా సేవ్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




