Gujarat: కలికాలం అంటే ఇదేనేమో.. 11 ఏళ్ల విద్యార్థితో పారిపోయిన 23 ఏళ్ల టీచర్!
23 ఏళ్ల ఓ ఉపాధ్యాయురాలు తన వద్దకు ట్యూషనుకు వచ్చే 11 ఏళ్ల విద్యార్థితో కలిసి పారిపోయిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో తీవ్ర కలకలం రేపింది. సుమారు నాలుగురు రాష్ట్రాలు దాటి వెళ్లిన ఈ ఇద్దరిని బుధవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ సరిహద్దులో ఓ ప్రైవేటు బస్సులో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సూరత్‌కు తరలించారు. టీచర్ తన కూమారుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని తండ్రి పీఎస్‌లో ఫిద్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

23 ఏళ్ల ఓ ఉపాధ్యాయురాలు తన వద్దకు ట్యూషనుకు వచ్చే 11 ఏళ్ల విద్యార్థితో కలిసి పారిపోయిన కేసు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలో ఓ మహిళా టీచర్ నివసిస్తోంది. అదే ప్రాంతంలో ఆ విద్యార్థి కుటుంబం కూడా నివసిస్తోంది. గత రెండు మూడేళ్లుగా వీరిద్దరి కుటుంబాలకు పరస్పర పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని ఒక కిరాణా షాపు నడిపిస్తున్న వ్యాపారవేత్త ఐదో తరగతి చదువుతున్న తన కుమారుడిని, అక్కడే ఉండే లేడీ టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు పంపేవాడు. ఆ విద్యార్థి రోజూ ఆ లేడీ టీచర్ వద్దకు ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా క్రమంగా పరస్పర ప్రేమగా మారింది. ఇది కొన్నాళ్ల పాటు అలాగే కొనసాగింది.
అయితే ఇక్కడ వీళ్లకు ఒక చిక్కు వచ్చి పడింది. ఆ లేడీ టీచర్‌కు ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడం… అటు విద్యార్థి తల్లిదండ్రులు చదవు విషయంలో సీరియస్‌గా వ్యవహరించడం వీరికి ఇబ్బందులను తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక వారి వారి ఇళ్లలలో సమస్యలు ఎదుర్కొంటున్న ఇద్దరూ పారిపోయేందుకు ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక వెళ్లి పోదామని డిసైడ్ అయిన టీచర్.. పథకం ప్రకారం ఏప్రిల్ 25న మధ్యాహ్నం విద్యార్తిని తీసుకొని పారిపోయినట్టు తెలుస్తోంది. వాళ్లిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు వారి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు.
లేడీ టీచర్ తన కుమారుడిని తీసుకొని పారిపోయిందని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత రిక్షాలో వెళ్లినట్టు గుర్తించారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్‌లలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. చివరకు రాజస్థాన్ సరిహద్దులోని ఓ ప్రైవేటు బస్సులో లేడీ టీచర్‌తో పాటు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సూరత్‌కు తరలించినట్టు డీసీపీ భగీరథ్ గధ్వి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




