AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Under Construction Bridge: పేకమేడలా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. శిథిలాల కింద చితికిన కూలీల బతుకులు

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగులైన్ల వంతెన శుక్రవారం (మార్చి 22) ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్‌ జిల్లాలోని మరీచా సమీపంలో భేజాచ బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఈ వంతెన శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని కొంత భాగం..

Under Construction Bridge: పేకమేడలా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. శిథిలాల కింద చితికిన కూలీల బతుకులు
Under Construction Bridge Collapsed
Srilakshmi C
|

Updated on: Mar 22, 2024 | 11:14 AM

Share

పాట్నా, మార్చి 22: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగులైన్ల వంతెన శుక్రవారం (మార్చి 22) ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్‌ జిల్లాలోని మరీచా సమీపంలో భేజాచ బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఈ వంతెన శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని కొంత భాగం కూలిపోయింది. అప్పటికే నిర్మాణ పనులు జరుగుతుండటంతో శిథిలాల కింద పడి 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికుల ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా భయంకంగా మారింది.

సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయాలపాలైన తొమ్మిది మంది రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

కాగా కోసీ నదిపై రూ.1700 కోట్లకుపైగా వ్యయంతో వంతెనను నిర్మిస్తున్నారు. భగల్‌పూర్‌, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2014లో దీని నిర్మాణానికి బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. 2019 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావల్సి ఉంది. కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదం బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడాన్ని పోలి ఉందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాజా ఘటన రాష్ట్ర అధికార ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల వాగ్వాదానికి దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్