PM Modi: భూటాన్‌లో ప్రధాని మోదీకి సాదర స్వాగతం.. వీడియో మీరూ చూసేయండి..
పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి విదేశీ పర్యటన చేస్తున్నారు ప్రధాని మోదీ. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్నారు ప్రధాని. పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత..
పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి విదేశీ పర్యటన చేస్తున్నారు ప్రధాని మోదీ. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్నారు ప్రధాని. పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత.. భూటాన్ సైనిక వందనం స్వీకరించారు మోదీ. దౌత్య సంబంధ చర్చలతో పాటు.. ఇవాళ, రేపు భూటాన్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రిని ఆహ్వానించే కార్యక్రమంలో భూటాన్ రాజు, ఆయన మెజెస్టీ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో పాటు భూటాన్ నాలుగో రాజు, ఆయన మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ హాజరయ్యారు.
మరోవైపు ఇరు దేశాల స్నేహాన్ని మరింతగా బలోపేతం చేసే దిశగా భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గేతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక చర్చలు జరుపుతారు. ఇక ఈ రెండు రోజుల భూటాన్ పర్యటన ప్రధాని మోదీ థింఫులో ఉన్న గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. థింఫులో భారత ప్రభుత్వ సహకారంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

