మంచి నిద్ర కోసం ఈ యోగాసనాలు ట్రై చేయండి! హాయిగా గుర్రుపెడతారు..!!
యోగాసనాలు మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా మెరుగవతుందని చెబుతున్నారు. అంతేకాదు.. జీర్ణక్రియ సమస్యలు కూడా తొలగిపోతాయి. కడుపు సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేసి, ఒత్తిడిని దూరం చేస్తుంది. అలసట మరియు శరీర నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అలాంటి యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

యోగా మన మనస్సు, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుందని మనందరికీ తెలిసిందే.. అంతేకాదు.. రాత్రి మంచి నాణ్యమైన నిద్ర కోసం కూడా యోగా పలు రకాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకపోతే కొన్ని యోగా ఆసనాలు చేయడం ద్వారా మీరు హాయిగా, ప్రశాంతమైన నిద్రను పొందుతారని అంటున్నారు. అలాంటి యోగాసనాలు మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా మెరుగవతుందని చెబుతున్నారు. అంతేకాదు.. జీర్ణక్రియ సమస్యలు కూడా తొలగిపోతాయి. కడుపు సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేసి, ఒత్తిడిని దూరం చేస్తుంది. అలసట మరియు శరీర నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అలాంటి యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
బాలాసనం:
బాలాసనం వేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే టెన్షన్ తగ్గుతుంది. తొందరగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ ఆసనం వేయడం మంచిది.
బద్ధకోణాసనం:
ఈ ఆసనం వేయడం ద్వారా ఒత్తిడి సులువుగా తగ్గిపోతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర రాని సమయంలో ఈ ఆసనంలో 2 నిమిషాలు కూర్చుంటే చాలా బాగా నిద్రపడుతుంది.
అధోముఖ స్వనాసనం:
అధోముఖ స్వనాసనంఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గించడంలో అధోముఖ స్వనాసనం సహాయపడుతుంది. ఈ ఆసనం వేస్తే నిద్ర నాణ్యత పెరుగుతుంది. బాగా నిద్రపోవచ్చు.

సేతుబంధాసనం:
ఈ ఆసనం వేయడం ద్వారా ఛాతి కండరాలు ఓపెన్ అవుతాయి. తద్వారా శ్వాస ప్రక్రియ బాగా జరుగుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడి నిద్ర బాగా పడుతుంది.
మార్జారియాసనం:
ఈ ఆసనం వేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఆరోగ్యంగానూ ఉంటారు.
ఉత్తనాసనం:
ఈ ఆసనం వేయడం ద్వారా వెన్నెముక, మెడ, లోయర్ బాడీ కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.
విపరీత కరణి:
ఈ ఆసనం వేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలసట దూరమవుతుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. బాగా నిద్రపడుతుంది.
సుప్త మత్స్యేంద్రాసనం:
ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. నిమిషాల్లో నిద్ర పడుతుంది. మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
శవాసనం:
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కాసేపు శవాసనంలో ఉంటే చాలు. శరీరంపై ఒత్తిడి తగ్గుతుంది. మనసు కుదుటపడుతుంది. బాగా నిద్ర పడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)








