Health Tips: టీ-కాఫీ తాగిన తర్వాత నీళ్లు ఎందుకు తాగాలి.. తప్పక తెలుసుకోండి..
ప్రపంచవ్యాప్తంగా తక్షణ శక్తి కోసం తాగే టీ, కాఫీలు శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచుతాయి. నిపుణుల ప్రకారం ఆ పానీయాలు తాగిన వెంటనే నీరు త్రాగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా కెఫీన్ వల్ల కోల్పోయిన తేమ తిరిగి వస్తుంది. అంతేకాకుండా నీరు దంతాలపై పేరుకుపోయే చక్కెరను, టానిన్‌లను తొలగించి.. మరకలు, కావిటీలను నివారిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయాయి. అవి మెంటల్ రిలీఫ్ , ఉల్లాసం కోసం ఎక్కువగా తాగుతుంటారు. రోజుకు ఐదారుసార్లు తాగితే కానీ కొందరికీ మనశ్శాంతి ఉండదు. అయితే ఇవి మనకు తక్షణ ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. క్రమంగా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే టీ లేదా కాఫీ తాగేటప్పుడు లేదా తర్వాత నీరు త్రాగడం చాలా ముఖ్యం. ఈ విషయంలో నిపుణులు ఏమి చెబుతున్నారో చూద్దాం.
ఎప్పుడు నీరు తాగాలి?
నిపుణుల ప్రకారం.. టీ లేదా కాఫీ తాగే ముందు లేదా తర్వాత మీరు ఎప్పుడైనా నీరు త్రాగవచ్చు. కానీ ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగిన తర్వాత నీరు త్రాగడం చాలా ముఖ్యం. కాఫీ లేదా టీ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల అనేక చిన్న, ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా నివారించవచ్చని వివరించారు.
టీ, కాఫీ తర్వాత నీళ్లు తాగడం వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలు:
డీహైడ్రేషన్‌ను నివారించడం
టీ – కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. టీ లేదా కాఫీ తాగిన తర్వాత నీరు త్రాగడం వల్ల శరీరం కోల్పోయిన తేమ, ద్రవ సమతుల్యతను తక్షణమే పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండటానికి దోహదపడుతుంది.
దంతాలపై మరకలు ఉండవు
టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారి దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంటాయి. ఈ పానీయాలలో ఉండే కెఫిన్, టానిన్లు దంతాల ఉపరితలంపై రుకుపోవడం దీనికి కారణం. అయితే టీ లేదా కాఫీ తర్వాత వెంటనే నీరు త్రాగడం వల్ల దంతాల ఉపరితలాన్ని నీరు శుభ్రపరుస్తుంది. తద్వారా మరకలు ఏర్పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
కావిటీలను నివారించడం
టీ, కాఫీలో సాధారణంగా చక్కెర ఉంటుంది. ఈ చక్కెర దంతాలకు అంటుకుని, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది క్రమంగా కావిటీలకు దారితీస్తుంది. తాగే నీరు ఈ చక్కెరను కడిగివేసి, కావిటీల నుండి మీ దంతాలను రక్షిస్తుంది.
దుర్వాసన నుండి ఉపశమనం
టీ లేదా కాఫీ తాగిన తర్వాత చాలా మందికి నోటి దుర్వాసన వస్తుంది. ఎందుకంటే కెఫిన్ లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నీరు త్రాగటం లాలాజల స్థాయిలను సాధారణ స్థితికి వచ్చి.. నోటిని శుభ్రంగా ఉంచుతుంది.. తద్వారా దుర్వాసనను తొలగిస్తుంది.
అసిడిటీని తగ్గించడం
కొంతమంది టీ లేదా కాఫీ తాగిన తర్వాత తరచుగా గుండెల్లో మంట లేదా అసిడిటీతో బాధపడుతుంటారు. దీనికి కారణం టీ, కాఫీ రెండూ కొంచెం ఆమ్లంగా ఉండటమే. ప్రత్యేకించి వీటిని ఖాళీ కడుపుతో లేదా పెద్ద పరిమాణంలో తీసుకున్నప్పుడు అసిడిటీ పెరుగుతుంది. ఆ తర్వాత నీరు త్రాగడం వల్ల కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేయవచ్చు.
ఈ సమస్యలన్నింటినీ నివారించి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి టీ లేదా కాఫీ తాగిన వెంటనే నీరు త్రాగడాన్ని అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




