Tears: కన్నీళ్లు ఉప్పగా ఎందుకుంటాయో తెలుసా.. వాటిలో ఇన్ని రకాలు ఉంటాయా..!!
అయితే శరీర వ్యవస్థ గురించి అందరికి అన్ని తెలియవు.. ఎంత తెలిసిన మనకు తెలియని మరో విషయం ఎదో ఒకటి ఉంటుంది.
మానవ శరీరం అనేది ఓ అద్భుతం.. శరీరం గురించి.. నాడీ వ్యవస్ధ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతీ అంశం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. మన మెదడు, దాని ఆలోచన శక్తి.. గుండె దాని పనితీరు.. ఇలా మనం తెలుసుకోవడాని ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే శరీర వ్యవస్థ గురించి అందరికి అన్ని తెలియవు.. ఎంత తెలిసిన మనకు తెలియని మరో విషయం ఎదో ఒకటి ఉంటుంది. అలాటి అంశమే కన్నీళ్లు. కన్నీళ్లు, బాధకలిగినప్పుడు, ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు కన్నీళ్లు వస్తాయి. కానీ మనం వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడము.. నిజానికి పట్టించుకోము. కన్నీళ్లు ఉప్పగా ఉంటాయని అందరికి తెలుసు. కానీ అవి ఉప్పగా ఎందుకు ఉంటాయి అంటే మంత్రం చెప్పడం కొంతమందికి కష్టమే.. ఎదో సినిమాలోని పాటలో వచ్చినట్టు తీయకుంటే కడదాకా విడువుము కనుక అని సమాధానం చెప్తుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే..
కన్నీళ్లలోని ఎలక్త్రోలైట్స్ కారణంగా కంట్లో బాక్టీరియా, ఇతర క్రిములు పెరగకుండా చేసుకుంటాయి. అలాగే కన్నీళ్లలో అనేకరకాల కార్బనిక, అకార్బనిక సమ్మేళనాలు, ప్రోటీన్లు, లవణాలు ఉంటాయి. ఈ లవణాలలో ముఖ్యమైనవిగా సోడియం, పొటాషియం ఉంటాయట. అందుకే కంట్లో నుంచి వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి. అయితే కన్నీళులో రకాలు కూడా ఉంటాయట. కన్నీళ్లు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకసారి ఎక్కువ ఉప్పగా ఉంటే మరోసారి తక్కువ ఉప్పగా ఉంటాయి.
వాటిలో ఒకటి బెసల్ కన్నీళ్లు మన కళ్ళు ఎప్పుడూ పొడిబారకుండా ఉంచుతాయి. కను రెప్పలు మూస్తున్న ప్రతీసారి కన్నీటి గ్రంధులలో నుంచి వస్తాయి ఇవి. ఇవి ఎక్కువ ఉప్పగా ఉంటాయట.
అలాగే రిఫ్లెక్స్ కన్నీళ్లు దుమ్ము, ధూళి, ఉల్లిపాయలు తరిగెటప్పుడు విడుదలయ్యే కెమికల్స్ ఈ కన్నీళ్లు మన కాళ్లను సురక్షితంగా ఉంచుతాయట. ఇక సైకిక్ కన్నీళ్లు ..ఇవి మనలో ఉండే ఎమోషన్స్ కారణంగా వస్తాయట. అయితే ఇతర కన్నీటిలో లేని హార్మోన్లు, ప్రోటీన్లు ఉండటంతో ఈ కన్నీళ్లు మన బాధ కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం