Life Style: పెదవులకు కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
శరీరంపై పుట్టుమచ్చలు ఉండటం చాలా సాధారణమైన విషయం. చర్మంలోని మెలనిన్ కణాలు ఒకే చోట పోగుపడటం ద్వారా ఈ మచ్చలు ఏర్పడతాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. చాలా మంది శరీరంపై...

Mole On Lips
శరీరంపై పుట్టుమచ్చలు ఉండటం చాలా సాధారణమైన విషయం. చర్మంలోని మెలనిన్ కణాలు ఒకే చోట పోగుపడటం ద్వారా ఈ మచ్చలు ఏర్పడతాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. చాలా మంది శరీరంపై పుట్టుమచ్చలను అందంతో ముడిపెడుతుంటారు. మెడలో పుట్టుమచ్చ ఉంటే చాలా నగలు ధరిస్తారని చెబుతుంటారు. పుట్టుమచ్చలు తమ విధిని నిర్ణయిస్తాయని చాలా మంది నమ్ముతారు. శరీరంపై ఆయా భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఏమేం జరుగుతాయో కూడా చెబుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రంథాలను కూడా రచించారు. మీ ముఖంపై ఏ పుట్టుమచ్చ ఉందో, అది మీకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. కళ్లలో పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రేమ విషయానికి వస్తే భావోద్వేగంగా, సున్నితంగా ఉంటారు. కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు స్వావలంబన కలిగి ఉండరు. వారు ఇతరుల సహాయంపై ఆధారపడతారు.
పెదవులకు కుడి వైపున పుట్టుమచ్చ ఉన్న వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. బొటన వేలుపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు. బొటనవేళ్లపై పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెలివైనవారు అంతే కాకుండా వారి తెలివితో అందరినీ ఆకట్టుకుంటారు. చూపుడు వేలు, బొటనవేలు, మధ్య వేలు పై పుట్టు మచ్చ ఉంటే చాలా డబ్బు వస్తుందని చెబుతుంటారు. అయితే చూపుడు వేలుపై పుట్టుమచ్చ ఉన్నవారికి చాలా మంది శత్రువులు ఉంటారు. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండటం అవసరం.
ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నవారికి కోరికలు అధికంగా ఉంటాయి. ఈ వ్యక్తులు తమ జీవితంలో చాలా చేయాలనుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త విషయాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఈ వ్యక్తుల మెదడు కూడా చాలా చురుకుగా పని చేస్తుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం



