Lifestyle: బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? బీట్‌రూట్‌ ప్యాక్‌తో ఇలా చెక్‌ పెట్టండి..

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పులు, కాలుష్యం కారణంగా ఇటీవల బట్టతల సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో..

Lifestyle: బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? బీట్‌రూట్‌ ప్యాక్‌తో ఇలా చెక్‌ పెట్టండి..
Beetroot For Bald Head
Follow us

|

Updated on: Nov 11, 2022 | 2:48 PM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పులు, కాలుష్యం కారణంగా ఇటీవల బట్టతల సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో లభించే బీట్‌రూట్‌తో బట్టతలకు చెక్‌ పెట్టవచ్చని మీకు తెలుసా.? బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్‌ ప్యాక్‌గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

బీట్‌రూట్‌ హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు.. బీట్‌రూట్ రసం అర కప్పు, అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అనంతరం బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ చేయడానికి ఒక పాత్ర తీసుకోవాలి. అనంతరం ఆ పాత్రలో అరకప్పు బీట్‌రూట్ రసం వేయాలి. తర్వాత అందులో రెండు చెంచాల అల్లం రసం కలపాలి. అనంతరం అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. వీటన్నంటినీ బాగా కలపితే బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది.

ఇలా అప్లై చేసుకోండి..

బీట్‌రూట్ హెయిర్‌ ప్యాక్‌ను వెంట్రుకలకు అప్లై చేసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని జుట్టు, తలపై కొద్దిగా అప్లై చేసిన నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా 20 నిమిషాలపాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బట్టతల సమస్య దూరమవుతుంది. జుట్టు రాలడం ఆగిపోయి, వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

నోట్: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు అందించిన సూచనలు మాత్రమే. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచన తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..