AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Fever: చలికాలంలో భయపెట్టే డెంగ్యూ ఫీవర్‌.. త్వరగా కోలుకోవాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే

శీతాకాలంలో డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జీవనశైలితో పాటు ఆహారం, పానీయాలపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

Dengue Fever: చలికాలంలో భయపెట్టే డెంగ్యూ ఫీవర్‌.. త్వరగా కోలుకోవాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే
Dengue, Viral Fever
Basha Shek
|

Updated on: Nov 11, 2022 | 2:11 PM

Share

చలికాలంలో బాగా భయపెట్టే వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. అందుకు తగ్గట్టే ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సమస్య తీవ్రతరమైతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే శీతాకాలంలో డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జీవనశైలితో పాటు ఆహారం, పానీయాలపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. మరి డెంగ్యూ లాంటి భయంకరమైన రోగాల నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

బొప్పాయి ఆకు

డెంగ్యూ జ్వరం సమయంలో బొప్పాయి ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకులు ఈ ప్రమాదకరమైన వ్యాధితో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పలు పరిశోధనలు, అధ్యయనాల్లో కూడా ఇది నిరూపితమైంది.

కొబ్బరి నీరు

డెంగ్యూ రోగులకు కొబ్బరి నీరు కూడా ఒక దివ్యౌషధం. కొబ్బరి నీరు సహజ వనరు. ఇందులో ఉండే ముఖ్యమైన ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు డెంగ్యూ రోగులలో కోల్పోయిన నీటి స్థాయులను భర్తీ చేస్తాయి. దానిమ్మ, నిమ్మరసంతో కలిపి కొబ్బరి నీళ్లను తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మెంతి ఆకులు

డెంగ్యూ జ్వరంలో, రోగి తప్పనిసరిగా మెంతులు కానీ మెంతి ఆకులను తినాలి. ఇవి జ్వరం వల్ల కలిగే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అలాగే మంచి నిద్ర వచ్చేలా తోడ్పడుతాయి.

నారింజ కూడా..

డెంగ్యూ జ్వరంతో శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోతాయి. బాడీ వేగంగా డీహైడ్రేషన్‌కు గురువుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ పండ్లను బాగా తీసుకోవాలి. ఇది శరీరంలో నీటి స్థాయులను పెంచడంతో పాటు సీజనల్‌ రోగాల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి