Premature Babies: నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి?
ప్రస్తుతం చాలా చోట్ల తల్లికి నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి వారిని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. నెలలు నిండకుండా పుట్టడంతో వీరు చాలా వీక్‌గా, తక్కువ బరువుతో ఉంటారు. అంతేకాకుండా వీరు బ్రతకడం కూడా కష్టం అని కూడా చెబుతూ ఉంటారు డాక్టర్లు. ఇలా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా నెలలు నిండకముందే పుట్టిన శిశువులపై అదనపు సంరక్షణ అవసరం. వీరిపై ఎక్కువగా శ్రద్ధ..

ప్రస్తుతం చాలా చోట్ల తల్లికి నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి వారిని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. నెలలు నిండకుండా పుట్టడంతో వీరు చాలా వీక్‌గా, తక్కువ బరువుతో ఉంటారు. అంతేకాకుండా వీరు బ్రతకడం కూడా కష్టం అని కూడా చెబుతూ ఉంటారు డాక్టర్లు. ఇలా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా నెలలు నిండకముందే పుట్టిన శిశువులపై అదనపు సంరక్షణ అవసరం. వీరిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ప్రీమెచ్యూర్ వల్ల వీరి శరీరం, లోపలు ఆర్గాన్స్ అభివృద్ధి చెందకపోవచ్చు. కాబట్టి వీరిలో న్యూరో డెవలప్‌మెంట్ అనేది అసాధారణంగా ఉంటుంది.
ప్రసవం తర్వాత సరైన పోషకాహారం లేకపోవడంతో వీరిలో అసహజ నరాల అభివృద్ధికి దారి తీస్తుంది. అందుకే వీరికి మంచి పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో పెరుగుదల అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, నేర్వెస్ వీక్‌నెస్, బలహీనమైన ప్రవర్తన ఉంటుంది. 32 వారాల కంటే ముందుగా పుల్లిన పిల్లలు నేరుగా తల్లి పాలు తాగలేరు. అంతే కాకుండా శ్వాస కోశ బాధ, హీమోడైనమిక్ అస్థిరత, అసిడోసిస్, సెప్సిస్ మొదలైన అవలక్షణాలను కలిగి ఉంటారు.
ప్రీమెచ్యూర్ బేబీస్‌ని పుట్టగానే వారిని వెంటిలేటర్ మీద పెడతారు. వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత.. బిడ్డను తల్లి హత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల తల్లి గుండె చప్పుడు, తల్లి స్పర్శను అనుభవించే వీలు ఉంటుంది. దీంతో బిడ్డ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా శిశువును ఇన్ ఫెక్షన్లు, అలర్జీల నుండి కాపాడటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం అవసరం. శిశువు ఊపిరి పీల్చుకుంటుందో కూడా పరిశీలిస్తూ ఉండాలి.
నెలలు నిండకుండా పుట్టే పిల్లలపై తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం.. రక్త హీనత సమస్య, వినికిడి సమస్యలు, మానసిక రుగ్మతలు, పలు రకాల లోపాలు, జీవక్రియ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. శిశువుకు దాదాపు 3 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








