Sprouts Health Benefits: ఆరోగ్యానికి మంచిదని మొలకలు రోజూ తింటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్.. ఇది చదవండి..
మొలకలు విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉన్న మంచి పోషకాహారం. వీటిని రోజూ తినడం ద్వారా జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. అయితే వాటిని ఎలా తినాలి? పచ్చిగా తినాలా? ఉడకబెట్టి తినాలా? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..

మొలకెత్తిన మొలకలు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు, నిపుణులు ఎప్పుడు చెబుతుంటారు. వాటినిన రోజూ తినాలని సూచిస్తుంటారు. నిజమే ఈ మొలకలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా బీన్స్, బఠానీలు , తృణధాన్యాలు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాల అంకురోత్పత్తి నుంచి మొలకలు లభిస్తాయి. ఇవి విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉన్న మంచి పోషకాహారం. వీటిని రోజూ తినడం ద్వారా జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. అయితే వాటిని ఎలా తినాలి? పచ్చిగా తినాలా? ఉడకబెట్టి తినాలా? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..
అధికంగా ఫైబర్..
మొలకలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, అవి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి . శరీరంలోని హెచ్‌డిఎల్ (హై-డెన్సిటీ లైపోప్రొటీన్) స్థాయిలు అయిన ‘మంచి కొలెస్ట్రాల్’ను పెంచడంలో కూడా మొలకలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయని వివరిస్తున్నారు.
మొలకలను ఎలా తినాలి.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఉడకబెట్టి తినడం మంచిది. దానికి చాలా కారణాలున్నాయి. వినియోగానికి ముందు మొలకలను ఆవిరి ద్వారా లేదా స్టవ్ పై ఉడికించడం మంచిది. ఇలా చేయమనడానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగా ఉండే మొలకలలో సాల్మొనెల్లా, ఇ.కోలి వంటి సూక్ష్మజీవులు ఉండవచ్చు. అలాగే తేమలో లేదా తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో మొలకెత్తిన ఈ గింజలు ఫుడ్ పాయిజనింగ్ కూడా కారణమవుతాయని వివరిస్తున్నారు.
పచ్చివి జీర్ణం కావడం కష్టం..
మొలకలను తినడానికి ముందు ఉడకబెట్టడం ద్వారా అవి త్వరగా జీర్ణం కావడానికి సాయ పడుతుందని చెప్పారు. పచ్చి మొలకలు జీర్ణం కావడం కష్టం. అంతేకాకుండా బలహీనమైన జీర్ణ వ్యవస్థ, లేదా పేగుల్లో లోపాలు ఉన్న వారు పచ్చిగా వీటిని తింటే కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి లేదా అతిసారం కలిగించే అవకాశాలుంటాయి. అయితే ఇలా ఉడకబెట్టడం వల్ల అందులోని కొన్ని న్యూట్రియంట్స్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా విటమిన్ సీ ప్రధానంగా పోతుంది.
వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి..
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు పచ్చి మొలకలు తినడం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, పచ్చి మొలకల వల్ల కలిగే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాల లక్షణాలు వారి శరీరంలో బహుళ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..