అయ్యయ్యో.. చపాతీ పిండి మరీ ఎక్కువైందా..? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది..!

పాతీ చేసేటపుడు పిండి ఎంత కలపాలి అని కొందరు తికమక పడుతుంటారు. పిండి గట్టిగా ఉన్నందున నీరు కలపడం, పిండి పలుచగా మారిందని మళ్లీ చపాతీ పొడి పిండి వేయడం చేస్తుంటారు. దీంతో మొత్తంగా తడిపిన పిండి ఎక్కువైపోతుంటుంది. అలా అనుకోకుండా పిండి ఎక్కువగా కలిపినప్పుడు.. మిగిలిపోయిన పిండిని ఏం చేయాలి..? ఎలా నిలువ చేసుకోవాలో తెలియక మహిళలు ఆందోళనపడుతుంటారు.

అయ్యయ్యో.. చపాతీ పిండి మరీ ఎక్కువైందా..? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది..!
Atta Dough
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2023 | 4:38 PM

నేడు చాలా మంది ఇళ్లలో చపాతీ లేకుండా పూట గడవదు. ప్రతి ఒక్కరి ఇళ్లలో వారంలో ప్రతిరోజూ చేసుకునే ఆహారం చపాతీ. కొందరికి బ్రేక్‌ఫాస్ట్, లేదంటే డిన్నర్‌లో చపాతీ కావాలి. కానీ చపాతీ చేసేటపుడు పిండి ఎంత కలపాలి అని కొందరు తికమక పడుతుంటారు. పిండి గట్టిగా ఉన్నందున నీరు కలపడం, పిండి పలుచగా మారిందని మళ్లీ చపాతీ పొడి పిండి వేయడం చేస్తుంటారు. దీంతో మొత్తంగా తడిపిన పిండి ఎక్కువైపోతుంటుంది. అలా అనుకోకుండా పిండి ఎక్కువగా కలిపినప్పుడు.. మిగిలిపోయిన పిండిని ఏం చేయాలి..? ఎలా నిలువ చేసుకోవాలో తెలియక మహిళలు ఆందోళనపడుతుంటారు. తడిపిన పిండి అలాగే పక్కనపెట్టేస్తే పాడవుతుందని, పోనీ చపాతీలు, పూరీలో చేసుకుందామంటే.. మళ్లీ అవి కూడా మిగిలిపోతాయనే ఆందోళన. ఇలా చాలా మంది తికమక పడుతుంటారు. కాబట్టి చపాతీ పిండిని నిల్వ ఉంచుకోవడానికి, అలాగే ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

పిండిని నీళ్లు పోసి కలుపుతున్నప్పుడు అందులో కొద్దిగా నూనె గానీ, లేదంటే నెయ్యి గానీ వేయండి. ఇలా చేయడం వల్ల పిండి మిగిలిపోయినప్పటికీ, మీరు దానిని నిల్వ చేసినప్పుడు ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది. తడి పిండిని వీలైనంత ఎక్కువ సమయం ఫ్రెష్‌గా ఉంచేందుకు..అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పెట్టుకోవచ్చు. అల్యూమినియం ఫాయిల్‌లో పిండిని పూర్తిగా కవర్‌ అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక డబ్బాలో పెట్టి నిల్వ చేసుకోవాలి.

మీకు అల్యూమినియం ఫాయిల్‌ లేకపోతే బదులుగా శుభ్రమైన, గాలి చొరబడని కంటైనర్‌ను ఉపయోగించవచ్చు. దీని వల్ల చపాతీ పిండిలో తేమ లేకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. నిల్వ చేయడానికి ముందు పిండిని శుభ్రమైన కిచెన్ టవల్‌తో చుట్టిపెట్టుకోండి. ఇది అదనపు తేమను తొలగించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తడిపిన పిండిని నిల్వ చేయడానికి జిప్ లాక్ బ్యాగ్‌లు కూడా వాడొచ్చు. ఫ్రిజ్లో నిల్వ స్థలం తక్కువగా ఉంటే ఈ బ్యాగ్‌లు మీకు సరిగ్గా సరిపోతాయి. జిప్ లాక్ బ్యాగ్‌లో పిండిని పెట్టి, అదనపు గాలిని తీసివేసి, దానిని జిప్ చేయండి. అంతే, మీ పిండి ఎక్కువ టైమ్‌ తాజాగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..