AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahamaputra River : మన దేశంలో ఉన్న ఏకైక మగ నది ఇదే..! దీని చరిత్ర, ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఈ నదిని భారతదేశంలో దేవతగా పూజిస్తారు. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ నదిలో స్నానం చేయాలని ఒక నమ్మకం. ఈ నదిలో స్నానం చేయడం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఈ నది మరో ప్రత్యేకత ఏమిటంటే..ప్రతి సంవత్సరం జూన్ నెలలో నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది.

Brahamaputra River : మన దేశంలో ఉన్న ఏకైక మగ నది ఇదే..! దీని చరిత్ర, ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Brahamaputra River
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2023 | 3:53 PM

Share

భారతదేశంలో నదుల చరిత్ర చాలా పురాతనమైనది. నదులు శతాబ్దాలుగా తమ స్వచ్ఛతను కాపాడుకుంటూ నిరంతరం తమ తమ దిశల్లో ప్రవహిస్తున్నాయి. గంగా వంటి పవిత్ర నది గురించి గ్రంథాలు, పురాణాలలో ప్రస్తావించబడింది. భారతదేశంలో ప్రవహించే గంగ, గోదావరి, నర్మద, సింధు, తుంగభద్ర మొదలైన నదులన్నింటికీ స్త్రీల పేర్లు పెట్టారు. ఈ కారణంగానే భారతీయ నదులను స్త్రీలతో పోల్చారు. నదిని తల్లిగా, పవిత్రంగా పూజిస్తారు. నదీస్నానం చేస్తే సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం. అయితే, భారతదేశంలోని ఏకైక పురుష(మగ) నది కూడా ఉంది. అవును ఇది నిజమే. భారతదేశంలోని పురుష నది అత్యంత పురాతనమైనది. అది బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మపుత్ర నది..ఈ నది ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

వేదాలు, పురాణాల ప్రకారం బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి. బ్రహ్మ దేవుడు గొప్ప ఋషి అని నమ్ముతారు. అయితే, శంతనుడి భార్య అమోఘ మహర్షి అందానికి బ్రహ్మ మంత్రముగ్ధుడయ్యాడై, వివాహమాడాడని చరిత్రలో చెబుతారు. బ్రహ్మ అమోఘాలకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని నమ్ముతారు. బ్రహ్మకు పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి బ్రహ్మపుత్ర అని పేరు వచ్చిందనే పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇకపోతే, భారతదేశంలో ఈ నది పొడవు 2900 కిలోమీటర్లు. ఇది చైనాలోని టిబెట్‌ మానస సరోవరం ఈ నదికి పుట్టినిల్లు. దీనిని టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు.

మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండవ నది ఇది.  చైనాలో పుట్టిన బ్రహ్మణపుత్ర అరుణచల్ ప్రదేశ్ లో భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ దక్షిణం వైపుగా ప్రవహించి జమున నది పేరుతో దిగువ గంగ నదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మరోక పాయ మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ నదులు బంగ్లాదేశ్ లోని చాంద్ పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదిని భారతదేశంలో దేవతగా పూజిస్తారు. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ నదిలో స్నానం చేయాలని ఒక నమ్మకం. బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయడం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మదోషం తొలగిపోతుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

బ్రహ్మపుత్ర నది ప్రత్యేకత ఏమిటంటే..ప్రతి సంవత్సరం జూన్ నెలలో బ్రహ్మపుత్ర నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది. బ్రహ్మపుత్ర నది, కామాఖ్య ఆలయానికి ఆనుకొని ఉంది. ఈ మూడు రోజులు కామాఖ్య దేవి తన మాస చక్రంలో ఉంటుందని నమ్ముతారు. ఈ కారణంగా బ్రహ్మపుత్ర నది మూడు రోజుల పాటు రక్తం రంగులోకి మారుతుందని పురాణాలలో చెప్పబడింది. ఈ నదిని హిందువులే కాకుండా జైనులు, బౌద్ధులు కూడా పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..