Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaturmas 2023: నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభం.. ఈ ఏడాది ఐదునెలలు ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదంటే..

ఈ చాతుర్మాసంలో దీక్ష చేపట్టిన భక్తులు మహా విష్ణువు, లక్ష్మీదేవి దంపతులను నిర్మలమైన హృదయంతో నియమ నిష్టలతో పూజించడం వలన ఇహపర సౌకర్యలను అనుభవిస్తారు. మోక్షాన్ని పొందుతారు. అంతేకాదు జీవితంలో సుఖ సంపదలకు లోటు ఉండదని విశ్వాసం. శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నందున ఈ నెలల్లో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేయకూడదని హిందువుల విశ్వాసం. ఈ  సమయంలో  మహావిష్ణువు, మహాదేవుడు పూజ అత్యంత శుభప్రదం

Chaturmas 2023: నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభం.. ఈ ఏడాది ఐదునెలలు ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదంటే..
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2023 | 1:13 PM

ఈ రోజు ఆషాడ తొలి ఏకాదశి. ఈ పర్వదినం నుంచి హిందువుల పండగలు ప్రారంభమవుతాయి. అంతేకాదు.. నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభమైంది.   జూన్ 29న ప్రారంభమైన చాతుర్మాసం నవంబర్ 23వ తేదీ వరకూ అంటే అధిక శ్రావణ మాసం రావడంతో దాదాపు 148 రోజులు పాటు..( 5 నెలల) వరకు ఏ శుభ కార్యం నిర్వహించారు. నేడు క్షీర సాగరంలో శేషుడిపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లాడని నమ్మకం. అనంతరం మహా విష్ణువు నవంబర్ 23 న దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడు. విష్ణుమూర్తి యోగ నిద్రతో ప్రారంభమైన  చాతుర్మాసం కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున ముగుస్తుంది.

వాస్తవానికి చాతుర్మాసం నాలుగు నెలల పాటు ఉంటుంది. అయితే ఈ ఏడాది అధిక శ్రావణ మాసం వచ్చింది. అంటే శ్రావణ మాసం నిజ శ్రవణం, అధిక శ్రవణంగా రెండు నెలలు ఉండనుంది. కనుక చాతుర్మాసం ఈ ఏడాది ఐదు నెలలు వచ్చిందని. ఈ సమయంలో శ్రీమహావిష్ణువును పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. చాతుర్మాసంలో వివాహంతో సహా శుభ కార్యాలకు దూరంగా ఉంటారు.  ఈ నేపథ్యంలో ఈ చాతుర్మాస దీక్ష సమయంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..

చాతుర్మాసం ప్రాముఖ్యత: 

ఇవి కూడా చదవండి

ఈ చాతుర్మాసంలో దీక్ష చేపట్టిన భక్తులు మహా విష్ణువు, లక్ష్మీదేవి దంపతులను నిర్మలమైన హృదయంతో నియమ నిష్టలతో పూజించడం వలన ఇహపర సౌకర్యలను అనుభవిస్తారు. మోక్షాన్ని పొందుతారు. అంతేకాదు జీవితంలో సుఖ సంపదలకు లోటు ఉండదని విశ్వాసం. శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నందున ఈ నెలల్లో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేయకూడదని హిందువుల విశ్వాసం. ఈ  సమయంలో  మహావిష్ణువు, మహాదేవుడు పూజ అత్యంత శుభప్రదం

చాతుర్మాసంలో చేయకూడని పనులు 

  1. చాతుర్మాసంలో మధుర, బృందావనం, గోకుల్, బర్సానా, ద్వారక వంటి ప్రాంతాలకు తప్ప వేరే ఇతర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లడం నిషేధం. అంతేకాదు మంచం మీద నిద్రపోరాదు.
  2. చాతుర్మాసంలో వివాహం, గృహ ప్రవేశం, ప్రాపంచిక కర్మలు వంటి శుభకార్యాలు చేయడం నిషేధం. మహావిష్ణవు యోగ నిద్ర నుంచి లేచిన అనంతరం ఈ పనులు చేయడం శ్రేయస్కరం.
  3. చాతుర్మాసంలో నీచ కర్మలు చేయడం నిషేధం. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకూడదని, ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకూడదని భావిస్తారు.
  4. చాతుర్మాస సమయంలో కొత్త నగలు , బంగారు వస్తువులను కొనుగోలు చేయవద్దు.
  5. చాతుర్మాసంలో బెండకాయ కూర, కారం, ఆకు కూరలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల, మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహారంతో పాటు పాలు , పెరుగుతో చేసిన వస్తువులు కూడా మంచివి కావు.

చాతుర్మాసంలో చేయాల్సిన పనులు

  1. చాతుర్మాసంలో భగవంతుని పూజించడం, ఉపవాస దీక్ష చాలా శుభప్రదంగా భావిస్తారు. వీలైతే రోజూ సత్యనారయణ స్వామి వత్ర కథ వినడం అత్యంత శ్రేయస్కరం.
  2. చాతుర్మాసంలో సాత్విక ఆహారంతో పాటు అన్నం, వస్త్రాలు, నీడ, దీపదానం, శ్రమదానం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
  3. చాతుర్మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి.. శ్రీ హరి, లక్ష్మీదేవిలను పూజించాలి.
  4. చాతుర్మాసంలో వీలైనంత వరకూ కోపానికి దూరంగా శాంతంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

Note : ఈ కథనంలో తెలిపిన సమాచారం నమ్మకాల మీద ఆధారితం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.