Tirumala: తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద బారులు తీరిన భక్తులు

తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు శ్రీ మహా విష్ణువు నిద్రపోతాడు. అందుకనే ఈ నాలుగు నెలల్లో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించరు. తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో రద్దీ నెలకొంది. విష్ణు రూపాలుగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయాలు, రామాలయాలు వంటి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంటుంది. 

Tirumala: తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద బారులు తీరిన భక్తులు
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2023 | 9:12 AM

శ్రీ మహావిష్ణువు కు ప్రీతి పాత్రమైన రోజు ఏకాదశి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి మరింత విశిష్ట స్థానం ఉంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని..  దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు.  హిందువులకు తొలి ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు శయనిస్తారని అందువలన లోక కళ్యాణార్ధము ఋషులు, స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు.

తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు శ్రీ మహా విష్ణువు నిద్రపోతాడు. అందుకనే ఈ నాలుగు నెలల్లో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించరు. తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో రద్దీ నెలకొంది. విష్ణు రూపాలుగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయాలు, రామాలయాలు వంటి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంటుంది.

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అలిపిరి నడకదారి నుంచి స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య అధికంగా ఉంది. మెట్ల మీద భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని చేరుకోవాటానికి పయనిస్తున్నారు. మరోవైపు అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో టీటీడీ సిబ్బంది మెట్ల మార్గాన్ని ఆలస్యంగా తెరచారు. ఉదయం 5. 30 తర్వాత మెట్లు మార్గాన్ని ప్రారంభించారు. భక్తులు గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..