Tomato Price: సెంచరీ దాటేసిన టమాటా ధర.. పెరుగుతున్న కూరగాయల ధరలు.. అప్రమత్తమైన స్టాలిన్ సర్కార్..

ఓవైపు టమాటాలను అందుబాటులోకి తీసుకుని రావడమే కాదు.. మరోవైపు పలు కూరగాయల ధరలని ప్రభుత్వ సహకార సూపర్ మార్కెట్ లలో ప్రజలకు తక్కువ రేటుకి అందుబాటులోకి తేవాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. 

Tomato Price: సెంచరీ దాటేసిన టమాటా ధర.. పెరుగుతున్న కూరగాయల ధరలు.. అప్రమత్తమైన స్టాలిన్ సర్కార్..
Tomato Price Hike
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2023 | 7:32 AM

భారతీయుల వంటకాల్లో టమాటో లేని ఇల్లు అంటూ ఉండదంటే అతిశయోక్తి లేదు. కూరల్లో, సూప్, పచ్చళ్లు వంటి అనేక రకాల వంటకాల్లో టమాటాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే గత కొంతకాలంగా టమాటో ధర ఆకాశాన్ని  చేరుకుంటూ సామాన్యులకు పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో టమాటా ధర రూ. వంద దాటేసింది. మండు వేసవిలోనూ తక్కువ ధరకు దొరికిన టమాటా.. గత వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు అనేక మార్కెట్లో రూ. 100 లకు చేరుకుంది. ఇప్పుడు తమిళనాడులో కేజీ టమాటో ధర రూ. 120 కి చేరుకుంది.

టొమాటతో పాటు పలు కూరగాయల ధరల ఒక్కసారిగా పెరగడం తో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది.  ప్రభుత్వ సహకార సూపర్ మార్కెట్ లలో టమాటో ధర కేజీ రూ. 60లను సాధారణ ప్రజలకి అందుబాటులోకి తెచ్చింది డీఎంకే సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ సహకార సూపర్ మార్కెట్ లలో టమాటో ధర యాభై శాతం తక్కువకి ఇవ్వాలని డీఎంకే స్టాలిన్ సర్కార్ నిర్ణయం తీసుకుని సామాన్యులకు టమాటాలను అందుబాటులోకి తీసుకుని రానుంది.

ఓవైపు టమాటాలను అందుబాటులోకి తీసుకుని రావడమే కాదు.. మరోవైపు పలు కూరగాయల ధరలని ప్రభుత్వ సహకార సూపర్ మార్కెట్ లలో ప్రజలకు తక్కువ రేటుకి అందుబాటులోకి తేవాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు మంత్రి పెరియకరుప్పన్, ప్రభుత్వ సహకార సూపర్ మార్కెట్ అధికారులతో సమీక్షించి తక్కువ ధరకి కూరగాయలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజలు కొంతమేర ఊరట పొందారు. అయితే కొన్ని నెలల క్రితం వరకూ రెండు మూడు రూపాయలకు దొరికిన టమాటా.. అకాల వర్షంతో అనేక రాష్ట్రాల్లో టమాటా పంట దెబ్బ తింది. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వేడితో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..