జనసేన బీజేపీల మధ్య శ్రీవాణి ట్రస్ట్ నిధుల వార్.. టీటీడీ విషయంలో బీజేపీకి ఉన్న కమిట్‌మెంట్‌ ఏపార్టీకి లేదంటూ సోము వీర్రాజు కౌంటర్

టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధుల వ్యవహారం జనసేన, బీజేపీ మధ్య చిచ్చు పెట్టాయి. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ.. టీటీడీ ట్రస్ట్ నిధుల వ్యవహారం.. జనసేన నేతలు చేసిన ఆరోపణలపై , బీజేపీ నేత స్పందిస్తూ.. నిధులు సేఫ్ అంటూ కామెంట్ చేయడంతో రెండు పార్టీల మధ్య వివాదం నెలకొంది. 

జనసేన బీజేపీల మధ్య శ్రీవాణి ట్రస్ట్ నిధుల వార్.. టీటీడీ విషయంలో బీజేపీకి ఉన్న కమిట్‌మెంట్‌ ఏపార్టీకి లేదంటూ సోము వీర్రాజు కౌంటర్
Bjp Vs Janasena
Follow us

|

Updated on: Jun 29, 2023 | 6:54 AM

ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా బీజేపీ, జనసేన పార్టీల మధ్య దోస్తీ ఉంది. రెండు పార్టీలు రాజకీయంగా ఎప్పుడూ కలిసి ముందుకెళ్లకున్నా.. మిత్రబంధం ఉందనే ప్రచారం మాత్రం ప్రచారంగానే కొనసాగుతోంది. ఈ సమయంలోనే.. టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధుల వ్యవహారం రెండు పార్టీల మధ్య వార్‌కు వేదికైంది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రూ. 10,000 లను విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ రూ. 500 లకు ఇస్తున్నారు. అయితే .. ఆ పది వేల విరాళం లెక్కలు బయటకు చెప్పడం లేదని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ ఆరోపణలపై స్పందింన బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి.. శ్రీవాణి ట్రస్టులో విరాళాలు ప్రక్కదారి పట్టడం లేదని, హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు, నిర్మాణాలకే వినియోగిస్తున్నారని చెప్పారు.

అంతేకాదు.. అనవసరంగా రాజకీయం చేయెద్దని మాట్లాడారు. ఈ మాటలు బీజేపీలోనే కాదు మిగతా పార్టీల్లో కలకలం రేపాయి. వెంటనే జనసేన నేత కిరణ్‌రాయల్‌ రంగంలోకి దిగి.. బీజేపీపై ఎదురుదాడి చేశారు. భానుప్రకాశ్ రెడ్డి బీజేపీలో ఉన్నారా.. వైసీపీలో చేరారా అని ప్రశ్నించారు. ఇక.. తాజాగా.. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ వివాదంపై జనసేనకు చురకలు అంటించారు సోము వీర్రాజు. టీటీడీ విషయంలో బీజేపీకి ఉన్న కమిట్‌మెంట్‌ ఏపార్టీకి లేదంటూ కిరణ్‌రాయల్‌ కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో ప్యాకేజీ వచ్చిందని మాట్లాడటం కరెక్ట్‌ కాదని.. ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యతతో మాట్లాడాలని జనసేన నేతలకు సూచించారు సోము వీర్రాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే