Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits : పచ్చి టమాటా ప్రయోజనాలు తెలుసా..? అందం, ఆరోగ్యంతో పాటు..

పచ్చి టమాటాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. పచ్చి టమాటాల్లో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే, పచ్చి టమోటాలు చర్మానికి వరం. పచ్చి టమాటాలోని విటమిన్..

Health Benefits : పచ్చి టమాటా ప్రయోజనాలు తెలుసా..? అందం, ఆరోగ్యంతో పాటు..
Green Tomato
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2023 | 6:10 PM

టామాట.. ప్రతి వంటింట్లోనూ అతి ముఖ్యమైన కూరగాయ. వివిధ రకాలుగా ఉపయోగించే టమాటా, సాంబారు, రసం, పులుసు ఇలా అనేక రకాలుగా వినియోగిస్తారు. టమాటాలను అలాగే పచ్చిగా కూడా తినవచ్చు. అందరూ ఎర్ర టామాటాను ఎక్కువగా వాడతారు, అయితే పచ్చి టమోటో ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎర్రటి టమాటా మార్కెట్‌లోని అన్ని షాపుల్లో పుష్కలంగా దొరుకుతుంది. కానీ పచ్చి టమాటాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మీకు తెలుసా..? పచ్చి టమోటాలు మీ ఆహారానికి రుచిని అందించడమే కాదు, వాటిని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా..? పచ్చి టమాటాలో కూడా ఆరోగ్య గుణాలు ఉన్నాయి.

అవును.. టమాటాలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పచ్చి టమాటాలోని పోషకాలు అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి. పచ్చి టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అస్సలు విడిచిపెట్టకుండా తింటారు. ఆకుపచ్చ టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పచ్చి టమాటాలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదలకు ఇది అవసరం. ఇది నరాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

పచ్చి టమాటాలో లైకోపీన్ ఉంటుంది. ఇది దాని ఎరుపు రంగును ఇస్తుంది. ఇది సహజ వర్ణద్రవ్యంగా పరిగణించబడే కెరోటినాయిడ్ రకం. అలాగే, పచ్చి టమాటాలు మీ ఎముకలు బలహీనంగా ఉంటే, మీకు నిరంతరం ఒళ్లు నొప్పులు వేధిస్తుంటే.. మీరు పచ్చి టమోటాలు తీసుకోవాలి. గ్రీన్ టమాటాలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. వాటి సాంద్రతను పెంచుతాయి. పచ్చి టమాటాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. పచ్చి టమాటాల్లో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే, పచ్చి టమోటాలు చర్మానికి వరం. పచ్చి టమాటాలోని విటమిన్-సి చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..