Watch: వార్నీ.. ఇది మెట్రోనా.. చేపల మార్కెట్టా..? ఇంకేన్నీ దారుణాలు చూడాలిరా సామీ..!

ఈ వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం ఎందుకు తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించినట్టుగా తెలిసింది.

Watch: వార్నీ.. ఇది మెట్రోనా.. చేపల మార్కెట్టా..? ఇంకేన్నీ దారుణాలు చూడాలిరా సామీ..!
Delhi Metro F
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2023 | 5:50 PM

ప్రయాణికుల రద్దీ కోసం మెట్రో పరుగులు పెడుతుండగా.. చాలా మంది తమ ఇంటిపనులు, పడక గదుల్లో, మేకప్‌లో, ఇతర అనైతిక కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే బెంగళూరు, ఢిల్లీతో సహా అనేక నగరాల్లో మెట్రో కోసం వేచి ఉన్న సమయంలో ప్రజలు మెట్రోలో బట్టలు ఆరబెట్టడం, అమ్మాయిలు మేకప్‌, హెయిర్‌ స్టైల్స్‌ కోసం, ప్రేమికులు ముద్దుపెట్టుకోవడం మొదలైన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో జరిగే వింతలు, విడ్డూరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు ఇలాంటి వార్త మరోకటి వైరల్‌గా మారింది. కదులుతున్న మెట్రోలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో కూడా ఢిల్లీ మెట్రోకు సంబంధించినదిగా తెలిసింది. మెట్రో అప్పటికే ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు బాహాబాహీ తన్నుకున్నారు. మెట్రోలో యువకులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వీటి ఫైటింగ్‌తో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు మనకెందుకులే అన్నట్టుగా దూరంగా జరిగిపోయారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వీడియో సోషల్‌ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌లో ఓ వ్యక్తి మెట్రో రైలులో చోరీ చేసేందుకు బ్యాగుల్లోని వస్తువులను దొంగిలించడం ప్రారంభించాడని.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై గొడవకు దారితీసింది. ఈ వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం ఎందుకు తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై ఢిల్లీ మెట్రో స్పందించినట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..