ఆకాశం నుండి పడుతున్న మెరుపులు, పిడుగులను ప్రత్యక్షంగా ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాక్ అవుతారు..
ఈ వీడియో రికార్డైన చోటి నుంచి కొద్ది దూరంలో ఉన్న కొందరు మహిళలు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైనట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వినియోగదారులు తీవ్రంగా స్పందించారు. బహుశా భవిష్యత్ ఆయుధాలు ఇలాగే ఉంటాయని ఒక వినియోగదారు రాశారు.
భారీ వర్షాల కారణంగా చాలాసార్లు భారీగా ఆస్తినష్టం, పంటనష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో ప్రతి సంవత్సరం పిడుగుపాటు కారణంగా కూడా మరణాలు సంభవించే వార్తలు వస్తుంటాయి. పిడుగుపాటుకు పొలంలో పని చేస్తున్న రైతు మృతి చెందాడనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. అందులో పిడుగుపాటు కారణంగా ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చూస్తాం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిడుగుపాటు ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అకస్మాత్తుగా విపత్తు సంభవించినట్లు కనిపిస్తోంది. ఆకాశంలో చీకటి మేఘాల మధ్యలోంచి అకస్మాత్తుగా మెరుపులు మొదలవుతాయి. ఈ వీడియో చూస్తే మీరు కూడా భయపడిపోతారు. వర్షం కురుస్తుందన్నట్లుగా వాతావరణం నెలకొని ఉన్నట్టు వీడియోలో తెలుస్తోంది. ఈలోగా ఆకాశం నుండి అధిక వేగంతో ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు రావడం మొదలైంది. పిడుగుపాటుకు గురైన చోట మంటలు చెలరేగినట్లు వీడియోలో కనిపిస్తోంది. చెట్టుకు మంటలు అంటుకున్నట్లు జూమ్‌తో వీడియో రికార్డ్ చేయబడింది. ఈ పన్నెండు సెకన్ల వీడియో చూస్తే నిజంగానే భయం వేస్తుంది.
— Explosion Videos (@explosionvidz) June 28, 2023
ఈ వీడియో రికార్డైన చోటి నుంచి కొద్ది దూరంలో ఉన్న కొందరు మహిళలు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైనట్టుగా వీడియోలో కనిపిస్తోంది. చాలా సందర్భాలలో ఈ స్కై మెరుపు చెట్టుమీద పడినట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వినియోగదారులు తీవ్రంగా స్పందించారు. బహుశా భవిష్యత్ ఆయుధాలు ఇలాగే ఉంటాయని ఒక వినియోగదారు రాశారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. అందులో పిడుగులు డిజాస్టర్‌గా పడ్డాయంటూ మరికొందరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..