- Telugu News Photo Gallery Worlds most expensive tree bonsai of japan worth more than over Rs.9 crore Telugu News
ఓరి దేవుడో..! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు ఇదేనట..! ఈ బోన్సాయ్ ధర తెలిస్తే కంగుతింటారు..
ప్రపంచంలో ఖరీదైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటి విలువ తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. లక్షల కోట్ల విలువైన కార్లు, భవనాల మీరు చూసి ఉంటారు. అయితే కోట్ల విలువైన చెట్టును మీరు ఎప్పుడైనా చూసారా? అవును, అటువంటి చెట్టు ఒకటి ఉంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టుగా పరిగణిస్తారు.. దీని పేరు పైన్ బోన్సాయ్ చెట్టు. దీని ధర చాలా ఎక్కువ. ఈ చెట్టు ఖరీదుతో మీరు అనేక మెర్సిడెస్, BMW కార్లను కొనుగోలు చేయవచ్చు.
Updated on: Jun 29, 2023 | 7:35 PM

ఈ చెట్టు ఖరీదు కోట్లలో ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొన్నేళ్ల క్రితం జపాన్‌లోని తకమట్సులో జరిగిన అంతర్జాతీయ బోన్సాయ్ సదస్సులో బోన్సాయ్ చెట్టును రూ.9 కోట్లకు పైగా వెచ్చించారు. ఇది ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన చెట్టు. ఇప్పటి వరకు ఏ చెట్టును ఇంత ఎక్కువ ధరకు అమ్మలేదు. (Photo: Pixabay)

బోన్సాయ్ చెట్లు చాలా విలువైనవి. ఎందుకంటే అవి పెరిగేకొద్దీ వాటిని సజీవంగా ఉంచడం చాలా కష్టం. వీటి ధర కూడా తదనుగుణంగా పెరగడానికి ఇదే కారణం. పాత వైన్, దాని ఖరీదు ఎక్కువ అని మీరు వినే ఉంటారు. ఈ చెట్టుదీ అదే పరిస్థితి. (Photo: Pixabay)

జపాన్‌లోని హిరోషిమాలో 400 ఏళ్ల నాటి బోన్సాయ్ చెట్టు కూడా ఉంది. దీనిని యమకి పైన్ అని పిలుస్తారు. వాస్తవానికి ఇది యమకి కుటుంబానికి చెందిన 6 తరాలచే భద్రంగా కొనసాగుతూ వస్తోంది. తరువాత దీనిని వాషింగ్టన్‌లోని నేషనల్ బోన్సాయ్, పెన్జింగ్ మ్యూజియమ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే 1945 సంవత్సరంలో ఇది హిరోషిమా బాంబు దాడి నుండి బయటపడింది.( Photo: Pixabay)

అవును, అటువంటి చెట్టు ఒకటి ఉంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టుగా పరిగణిస్తారు.. దీని పేరు పైన్ బోన్సాయ్ చెట్టు. దీని ధర చాలా ఎక్కువ. ఈ చెట్టు ఖరీదుతో మీరు అనేక మెర్సిడెస్, BMW కార్లను కొనుగోలు చేయవచ్చు. (Photo:Pixabay)

బోన్సాయ్ చెట్లు మాత్రమే కాదు, చాలా ఖరీదుకు అమ్ముడవుతాయి. కానీ కొన్ని కలపలు కూడా ఉన్నాయి. వీటిని కిలో లక్షల రూపాయలకు అమ్ముతారు. ఈ కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్. దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 7-8 లక్షల రూపాయలు. (Photo: Twitter/@AfricaFactsZone)





























