- Telugu News Photo Gallery Tea Farming: Farmers will get 50percent subsidy for tea cultivation in bihar
Tea Farming: ఈ పంట సాగుపై 50 శాతం సబ్సిడీ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రైతుల కోసం పలు రాష్ట్రాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్ని పంటల సాగుకు సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుంటే పంట సాగు కోసం అందించే రుణాలలో సబ్సిడీ అందిస్తున్నాయి..
Updated on: Jun 29, 2023 | 8:11 PM

బీహార్‌లోని రైతులు మామిడి, జామ, లిచి, పచ్చి కూరగాయలను పండించడమే కాకుండా తేయాకు కూడా పండిస్తారు. అరారియా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున తేయాకు సాగు చేస్తున్నారు. తేయాకు సాగు చేసే రైతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటం విశేషం.

ఇప్పుడు తేయాకు సాగు చేసే రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తేయాకు సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ సబ్సిడీని ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను కూడా నిర్ణయించింది.

బీహార్ ప్రభుత్వం ప్రత్యేక శాస్త్రీయ పంట పథకం కింద తేయాకు విస్తీర్ణాన్ని విస్తరించేందుకు ఈ రాయితీని ప్రకటించినట్లు చెబుతున్నారు. రైతు సోదరులు ఒక హెక్టారులో తేయాకు సాగు చేస్తే వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తారు.

సబ్సిడీ ఇవ్వడం వల్ల తేయాకు సాగు పట్ల రైతులకు ఆసక్తి పెరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టరేట్ అభిప్రాయపడింది. విశేషమేమిటంటే తేయాకు సాగుకు హెక్టారుకు యూనిట్ ధర రూ.494000గా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపైన రైతులకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది.

సబ్సిడీ మంజూరు చేసిన తర్వాత రైతులకు రూ.247000 ఉచితంగా లభిస్తుంది. కతిహార్, కిషన్‌గంజ్, పూర్నియా, అరారియా రైతులు మాత్రమే సబ్సిడీని పొందుతారు.





























