ఖర్జూరంతో అరటిపండు కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..!
అరటి పండు, పాలు, ఖర్జూరంతో చేసిన మిల్క్ షేక్ తాగితే రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలసట అనేది దూరం అవుతుంది. ఈ రెండింటిలో ఉండే కాల్షియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియను చక్కగా మారుస్తుంది. ఉదయాన్నే అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఖర్జూరంతో ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం,ప్రొటీన్, పొటాషియం, విటమిన్ బి-6 పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడం నుంచి రక్త ఉత్పత్తిని ఉత్తేజపరిచే వరకు ఖర్జూరాలు అనేక ప్రయోజనాల్ని అందిస్తాయి. అలాంటి ఖర్జూరాలకు అరటి పండు యాడ్ చేసి తీసుకుంటే రెట్టింపు లాభాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అరటిపండును ఖర్జూరంతో కలిపి తింటే మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అరటి పండు, ఖర్జూరం కలిపి తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ రెండింటితో తయారు చేసిన జ్యూస్ పరగడుపున తాగితే అనేక లాభాలున్నాయి. సన్నగా ఉన్నవారు తరచూ బనానా, ఖర్జూరాలు తింటే వెయిట్ కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. ఖర్జూరంతో అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. పాలు, అరటిపండు, ఖర్జూరంతో చేసిన మిల్స్ షేక్ తాగడం వల్ల అలసట, బలహీనత కూడా తొలగిపోతాయి. అరటిపండ్లు, ఖర్జూరాల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఖర్జూరంతో అరటి పండు కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇలా తింటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. అరటి పండు, పాలు, ఖర్జూరంతో చేసిన మిల్క్ షేక్ తాగితే రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలసట అనేది దూరం అవుతుంది. ఈ రెండింటిలో ఉండే కాల్షియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియను చక్కగా మారుస్తుంది. ఉదయాన్నే అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.