AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషాయాలు తప్పక తెలుసుకోండి..!

గుండె సంబంధ సమస్యలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. అల్జీమర్స్‌ రాకుండా అడ్డుకుని జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కొబ్బరి తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లో యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ పారాసైటిక్‌ సమ్మేళనాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి. కొబ్బరిని ఆకలిని నియంత్రించడంలో, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

పచ్చి కొబ్బరి తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషాయాలు తప్పక తెలుసుకోండి..!
Raw Coconut
Jyothi Gadda
|

Updated on: Feb 02, 2025 | 9:00 PM

Share

పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకొని తింటాం. లేదంటే, ఈ మధ్య ఎక్కువగా కొబ్బరి ఎండబెట్టి ఆయిల్‌ కూడా పడుతున్నారు. కానీ, పచ్చి కొబ్బరి తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు బరువు తగ్గించుకోవటానికి పచ్చి కొబ్బరిని తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరిని ఆరోగ్యానికి అద్భుత వరం అంటున్నారు ఆహార నిపుణులు.. ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి కూడా ఒకటి. ఈ పచ్చి కొబ్బరితో మాంగనీస్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు… అందరూ తినొచ్చు. కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నిలకడగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లు కొబ్బరికాయలలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పచ్చి కొబ్బరిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.. కణాలు ఆక్సిడేటివ్‌ ప్రభావానికి గురికాకుండా చూస్తాయి. అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయన్నమాట. కొబ్బరి మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. గుండె సంబంధ సమస్యలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది.  అల్జీమర్స్‌ రాకుండా అడ్డుకుని జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కొబ్బరి తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లో యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ పారాసైటిక్‌ సమ్మేళనాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి. కొబ్బరిని ఆకలిని నియంత్రించడంలో, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?