వార్నీ.. ఇదెక్కడి చోద్యం..’చోలీ కే పీచే క్యా హై’ అంటూ డ్యాన్స్‌ చేసిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్‌ అంటూ షాకిచ్చిన వధువు తండ్రి

అయితే, పెళ్లి మూహూర్తానికి ముందుగా వరుడిని స్నేహితులు అతన్ని డ్యాన్స్ చేయమని అడిగారు. పెళ్లికొడుకు డ్యాన్స్ చేయడానికి లేచి నిలబడగానే బాలీవుడ్‌లోని ఫేమస్‌ సాంగ్‌ చోలీ కే పీచే క్యా హై అనే పాట ప్లే చేశారు. వరుడు తన స్నేహితులతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. చాలా మంది అతిథులు కూడా వరుడు డ్యాన్స్ చేయడం చూసి అతన్ని ప్రోత్సహించారు. కానీ వధువు తండ్రికి మాత్రం

వార్నీ.. ఇదెక్కడి చోద్యం..'చోలీ కే పీచే క్యా హై' అంటూ డ్యాన్స్‌ చేసిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్‌ అంటూ షాకిచ్చిన వధువు తండ్రి
Marriage Cancelled
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2025 | 7:12 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి తన పెళ్లిలో బాలీవుడ్ పాటలో డ్యాన్స్ చేయడం అతని పాలిట శాపంగా మారింది. వరుడు చేసిన డ్యాన్స్‌ చూసి పెళ్లికూతురు కాదు, పెళ్లికూతురు తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు..పెళ్లి క్యాన్సిల్‌ అంటూ ఖరాకండిగా చెప్పేశాడు.. తిరిగి అతన్ని ఒప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెళ్లి క్యాన్సిల్‌ అంటే క్యాన్సిల్‌ అంటూ మొండికేశాడు ఆ తండ్రి. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. న్యూఢిల్లీలో వివాహం జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి మూహూర్తానికి ముందుగా వరుడిని స్నేహితులు అతన్ని డ్యాన్స్ చేయమని అడిగారు. పెళ్లికొడుకు డ్యాన్స్ చేయడానికి లేచి నిలబడగానే బాలీవుడ్‌లోని ఫేమస్‌ సాంగ్‌ చోలీ కే పీచే క్యా హై అనే పాట ప్లే చేశారు. వరుడు తన స్నేహితులతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. చాలా మంది అతిథులు కూడా వరుడు డ్యాన్స్ చేయడం చూసి అతన్ని ప్రోత్సహించారు. కానీ వధువు తండ్రికి మాత్రం ఇది అస్సలు నచ్చలేదు.

ఇవి కూడా చదవండి

వరుడు డ్యాన్స్ చేయడం సరికాదని, అందుకే వెంటనే పెళ్లి ఆపేస్తానని అందరి ముందు తేల్చి చెప్పేశాడు అమ్మాయి తండ్రి. వరుడి ప్రవర్తన తన కుటుంబ విలువలను కించపరిచేలా ఉందని వధువు తండ్రి ఆరోపించాడు. తండ్రి మాటలు విన్న నవ వధువు కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లికూతురు తన తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా అతడు అంగీకరించలేదు. ఇదంతా ఏదో సరదాగా చేసిందని ఏడుస్తున్న పెళ్లికూతురు తండ్రికి ఎన్ని రకాలుగా చెప్పినా ఆ తండ్రి ఒక్క మాట కూడా వినలేదు. పెళ్లి ఆపేసిన తరువాత కూడా వధువు తండ్రి ఆగ్రహం చల్లారలేదు. వరుడి కుటుంబంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దని తన కుమార్తెకు గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు.

అయితే, ఇలా మండపంలో పెళ్లి పీటలపైనే పెళ్లి క్యాన్సిల్‌ కావడం ఇది మొదటి పెళ్లి కాదు. గత ఏడాది డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ఒక వరుడు భోజనం సప్లైలో ఆలస్యం చేశారనే కారణంగా తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఆ రోజు తర్వాత అతను తన కజిన్ సోదరిని వివాహం చేసుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..