Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్‌ టీ మంచిదని తెగ తాగేస్తున్నారా..? అయితే, ఈ సమస్యలు గ్యారెంటీ..!

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. గ్రీన్ టీతో బరువు తగ్గడంతో పాటు శరీర నిర్విషీకరణ కోసం చాలా మంది గ్రీన్‌టీ అలవాటు చేసుకుంటున్నారు. అయితే, గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ రోజు మనం అతిగా గ్రీన్ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Feb 02, 2025 | 3:31 PM

గ్రీన్ టీ ఎక్కువగా తాగే వారిలో ఉదర సమస్యలు ఏర్పడతాయి. కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్​ సహా అనేక చికాకులు వస్తాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి మనం దానిని తక్కువగా తీసుకోవాలి.

1 / 5
గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇది దంత సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా మోతాదుకు మించి గ్రీన్ టీ తాగే వారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది. దీని వల్ల మన దంతాలు, ఎముకలు మొదటగా రంగు మారిపోతాయి. తరువాత క్రమంగా బలహీన పడిపోతాయి.

2 / 5
శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఐరన్ అతి ముఖ్యమైనది. అయితే గ్రీన్ టీని పరిమితికి మించి తాగటం వల్ల శరీరం ఐరన్ శోషణలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే గ్రీన్​ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మనం శరీరం ఐరన్​ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మనలో రక్తహీనత ఏర్పడుతుంది. అందుకే పరగడుపున కాకుండా, ఆహారంతోపాటే గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

3 / 5
గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా అతిగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది.  అలాగే గ్రీన్‌ టీలోని టానిన్లు వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి, మైగ్రేన్‌ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్‌ నొప్పికి కారణమవుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది.

5 / 5
Follow us