Kitchen Hacks: వంటకే కాదు.. క్లీనింగ్‌కి కూడా బంగాళాదుంప..! తెలిస్తే షాక్ అవుతారు..!
బంగాళాదుంప కేవలం ఆరోగ్యానికే కాదు ఇంటి పనుల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. వంట పాత్రలు మాడిపోవడం, తుప్పు పట్టడం, వెండి వస్తువులు నల్లబడిపోవడం, బట్టలపై మరకలు పడటం వంటి సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఖరీదైన కెమికల్స్‌తో వీటిని శుభ్రం చేసే అవసరం లేకుండా సహజసిద్ధమైన ఈ టిప్స్ పాటిస్తే చాలు.

బంగాళాదుంప కేవలం ఆరోగ్యానికే కాదు ఇంటి పనుల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. వంట పాత్రలు మాడిపోవడం, తుప్పు పట్టడం, వెండి వస్తువులు నల్లబడిపోవడం, బట్టలపై మరకలు పడటం వంటి సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. బంగాళాదుంపతో సులభంగా పరిష్కరించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు.
వంట చేస్తుండగా కూరలు అడుగంటితే గిన్నెలు మాడిపోతాయి. అటువంటి మురికిని శుభ్రం చేయడానికి బంగాళాదుంప ముక్కను నిమ్మరసంలో ముంచి మాడిన భాగంలో రుద్దాలి. అరగంట తర్వాత సబ్బుతో శుభ్రం చేస్తే గిన్నె కొత్తదానిలా మెరిసిపోతుంది.
తుప్పు పట్టిన స్టీల్, ఐరన్ పాత్రలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్ది చేతులు పుండ్లవ్వడం, పాత్రల మెరుపు తగ్గిపోవడం చాలా మందికి వచ్చే సమస్య. దీన్ని నివారించడానికి బంగాళాదుంపను మందపాటి ముక్కలుగా కోసి, బేకింగ్ సోడా లేదా సోప్ లిక్విడ్‌లో ముంచి తుప్పు ఉన్న చోట రుద్దాలి. ఆపై సబ్బుతో తోమితే తుప్పు పూర్తిగా పోతుంది.
తుప్పు పట్టిన కత్తులపై బంగాళాదుంప ముక్కతో రుద్ది ఐదు నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగి తుడిస్తే కత్తులు కొత్తవి అయినట్లు మెరుస్తాయి. గాలి తగిలి వెండి ఆభరణాలు, పూజా సామాగ్రి నల్లబడిపోతాయి. వాటిని మరిగించే నీటిలో వేసి శుభ్రం చేస్తే మెరుపు తగ్గిపోతుంది. అలా కాకుండా బంగాళాదుంపలు మరిగించిన గోరు వెచ్చటి నీటిలో వెండి వస్తువులను గంటసేపు నానబెట్టి బ్రష్‌తో శుభ్రం చేస్తే వెండి మళ్లీ మెరిసిపోతుంది.
టొమాటో కెచప్ వంటి మరకలు బట్టలపై పడితే అవి శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటి సమయంలో బంగాళాదుంప ముక్కతో మరకను రుద్ది బంగాళాదుంప ఉడికించిన నీటిని పోసి అరగంట తర్వాత ఉతికేస్తే మరక పూర్తిగా మాయం అవుతుంది. ఇలా బంగాళాదుంపను ఉపయోగించి ఇంటిని మెరిసిపోయేలా ఉంచుకోవచ్చు. ఖరీదైన కెమికల్స్‌తో శుభ్రం చేసే అవసరం లేకుండా సహజసిద్ధమైన ఈ టిప్స్ పాటిస్తే చాలు.