AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఇంట్లోనే డైమండ్ ఫేషియల్ చేయడం ఎలా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!

మనలో ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల క్రీమ్స్, ఫేషియల్స్ వాడుతుంటాం. అయితే ఇంట్లోనే తక్కువ ఖర్చులో సహజంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేసుకునే చిట్కాలు చాలానే ఉన్నాయి. వీటిలోని కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

Beauty Tips: ఇంట్లోనే డైమండ్ ఫేషియల్ చేయడం ఎలా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!
Diy Facials
Prashanthi V
|

Updated on: Feb 03, 2025 | 11:04 AM

Share

పెరుగుతో డైమండ్ ఫేషియల్ చేయొచ్చని మీకు తెలుసా..? పెరుగు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు తగ్గించి, బ్లీచింగ్ వలె పనిచేస్తుంది. ముఖానికి సహజమైన కాంతిని తెస్తుంది. పెరుగుతో ఫేషియల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుల్లటి పెరుగుతో ఫేషియల్

ముందుగా ఫేస్ క్లీన్ గా వాష్ చేయండి. తడి ఆరాక ఇప్పుడు కొద్దిగా పుల్లని పెరుగు తీసుకొని ఈ పెరుగును ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయండి. అంతే సింపుల్ ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు తగ్గుతాయి. బ్లీచింగ్ చేసినట్లుగా ఉంటుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ అనేక విధాలుగా హెల్ప్ చేస్తుంది.

షుగర్, కాఫీతో స్క్రబ్

పెరుగు, పంచదార, కాఫీ పొడిని కలిపి పేస్ట్ లా చేయండి. ఈ స్క్రబ్‌ను ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి. 5 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. దీని వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.

టమాట గుజ్జుతో స్కిన్ గ్లో

టమాట గుజ్జు, పెరుగును కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. వారానికి ఒకసారి, నెలకి రెండు సార్లు ఇలా చేయండి. ఈ ఫేషియల్‌ని వారానికి ఒకసారి లేదా నెలలో రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై డల్‌నెస్, ముడతలు తగ్గి, కాంతివంతంగా మారుతుంది.

ఈ సహజ ఫేషియల్స్‌ మీ చర్మానికి నేచురల్ గ్లోను తెచ్చిపెడతాయి. డైమండ్ ఫేషియల్ కోసం ఖరీదైన ట్రీట్‌మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సహజంగా చేయగలిగే ఈ చిట్కాలతో మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

Follow Us
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..