AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair cut : మనిషి జీవితంలో జుట్టు కత్తిరించకపోతే ఏం జరుగుతుంది..! అసలు జుట్టు ఎంతకాలం పెరుగుతుందో తెలుసా..?

Hair cut : అందమైన జుట్టు వారి వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టును పొడవుగా

Hair cut : మనిషి జీవితంలో జుట్టు కత్తిరించకపోతే ఏం జరుగుతుంది..! అసలు జుట్టు ఎంతకాలం పెరుగుతుందో తెలుసా..?
Hair Cut
uppula Raju
|

Updated on: Jun 12, 2021 | 3:42 PM

Share

Hair cut : అందమైన జుట్టు వారి వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టును పొడవుగా మందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. దాని కోసం రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టును అందంగా ఉంచడానికి కత్తిరించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మీ జుట్టుకు స్టైల్ చేస్తే, మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఇతర సమస్యల నుంచి బయటపడతారు. మీ జీవితమంతా మీ జుట్టును కత్తిరించకపోతే ఏమి జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి ? మీ జీవితమంతా కత్తిరించకపోతే మీ జుట్టు ఎంతకాలం పెరుగుతుందో తెలుసుకోండి.

శరీరంలో జుట్టు ఎంత ఉంటుంది ఒక బిడ్డ జన్మించినప్పుడు జుట్టు పెరిగే ప్రదేశం నుంచి మొత్తం 5 మిలియన్ హెయిర్ ఫోలికల్స్ ఉంటాయి. కానీ మన తలలో సుమారు 100,000 ఫోలికల్స్ ఉంటాయి. కొన్ని ఫోలికల్స్ జుట్టు పెరుగుదలను ఆపుతాయి అప్పుడు మీ జుట్టు సన్నగా లేదా బట్టతలగా మారుతుంది. అమెరికన్ డెర్మిటాలజీ అకాడమీ ప్రకారం.. జుట్టు నెలకు 1/2 అంగుళాలు పెరుగుతుంది అంటే, మీ జుట్టు సంవత్సరానికి సగటున 6 అంగుళాలు పెరుగుతుంది.

జుట్టు కత్తిరించకపోతే ఏమి జరుగుతుంది? ప్రతి నెల మీ జుట్టు సగం నుంచి 1 అంగుళాలు పెరుగుతుంది సగటున 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఈ విధంగా పెరుగుతుంది. వీటిలో కొన్ని మీ జుట్టును విచ్ఛిన్నం చేస్తాయి. ఒకరి జుట్టు ఎంత పెరుగుతుందో ప్రధానంగా వారి శరీర నిర్మాణ శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. అలాగే జుట్టు పెరగడం వారి వంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ జీవితమంతా మీ జుట్టును కత్తిరించకపోతే ఒక పాయింట్ తర్వాత పెరగదు. ఎందుకంటే జుట్టు కేవలం ఒక సంవత్సరంలో 6 అంగుళాల కంటే ఎక్కువ పెరగదు. అదనంగా జుట్టు పెరుగుదల కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పాత జుట్టు రాలిపోతుంది కొత్తవి వస్తూ ఉంటాయి.

జుట్టు పెరుగుదల ప్రధానంగా మూడు దశలలో జరుగుతుంది ప్రతి దశకు కాలపరిమితి ఉంటుంది. 1. అనాజెన్ – ఈ దశలో జుట్టు పెరుగుదలకు 2 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. 2. కాటాజెన్ – పరివర్తన దశలో జుట్టు పెరుగుదల ఆగి 4 నుంచి 6 వారాల వరకు ఉంటుంది. 3. టెలోజెన్ – ఈ దశలో జుట్టు అస్సలు పెరగదు ఈ పరిస్థితి 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది.

Corona Vaccine: గతనెలలో ప్రైవేటు ఆస్పత్రులకు అందిన వ్యాక్సిన్ కోటా ఎంత ? వాడిన డోసులు ఎన్ని …?

Viral Video: ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

Rashi In small Screen: బుల్లి తెరపై జ్ఞానాంబగా అడుగు పెట్టిన రాశి.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంటే