Rashi In small Screen: బుల్లి తెరపై జ్ఞానాంబగా అడుగు పెట్టిన రాశి.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంటే
Rashi In small Screen: బాలనటిగా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి, మీనల తర్వాత రాశి అని చెప్పవచ్చు..
Rashi In small Screen: బాలనటిగా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి, మీనల తర్వాత రాశి అని చెప్పవచ్చు. ఈ సొట్టబుగ్గల సుందరి 1990వ దశకంలో అబ్బాయిల కలల సుందరి. చిరు నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. ఈ అచ్చ తెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది.. ఎంత తర్వగా కెరీర్ లో ఎదిగిందో.. అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైపోయింది చిన్నది.
అక్కినేని నాగేశ్వర రావు గారిల్లు సినిమాలో రాశి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్ రామ్ తో పాటు రాశి కూడా బాలనటిగా బాలకృష్ణ నటించిన బాలచంద్రుడు నటించింది. అనేక సినిమాల్లో బాలనటిగా అలరించిన రాశి బదిలీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే 1997లో హీరోయిన్ గా జగపతిబాబు శుభాకాంక్షలు తో సూపర్ హిట్ అందుకుంది. చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది రాశి..
పవన్ కళ్యాణ్ గోకులంలో సీత, జగపతిబాబు పెళ్లి పందిరి, శ్రీకాంత్ ప్రేయసి రావే వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే బాలయ్యబాబుతో కృష్ణ బాబు సినిమాలో రాశి హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శ్రీకాంత్ కాంబినేషన్‌లో ఈమె చేసిన సినిమాలు సంచలన విజయం సాధించాయి. స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు చక్రం తిప్పింది రాశి. 90ల కాలంలో ఆమె దాదాపు అగ్ర దర్శకులందరితో వర్క్ చేశారు.
స్టార్ హీరోయిన్ రేంజ్ కు దగ్గరగా వచ్చి సడెన్ గా ఫెడ్ అవుట్ అయిపోయింది.. ఒకానొక సమయంలో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా రాశి కనిపించింది అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాశి ఇటీవల బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన పాత్రలతో మెప్పిస్తోంది. ప్రస్తుతం జానకి కలగనలేదు సిరియల్ లో నటిస్తుంది.
ఈ సీరియల్ హిందీలో సూపర్ హిట్ సీరియల్ దియా ఔర్ బాతి హమ్ కు రీమేక్ జానకి కలగనలేదు గా ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ లో రాశి జ్ఞానాంబ పాత్రలో నటిస్తుంది. అత్తగా రాశి నటనకు బుల్లి తెర ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారట. మంచి రేటింగ్ తో సాగుతుంది. అయిదు రాశి ఈ సీరియల్ లో నటిస్తునందుకు వారానికి లక్షకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందు ముందు జానకి కలగనలేదు సీరియల్ కు మరింత రేటింగ్ వస్తే.. రాశి రెమ్యునరేషన్ కూడా మరింత పెరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: గురక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా… ఈ సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు త్వరలో కోవిడ్ బాధితుల కోసం మరో సేవా కార్యకమానికి మెగా శ్రీకారం