AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghu Kunche: మల్టీ టాలెంటెడ్ పర్సన్.. ఐదు నందులు అందుకున్న ప్రతిభాశాలి రఘు కుంచె పుట్టిన రోజు నేడు

Raghu Kunche : రఘు కుంచే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్.. మల్టీ టాలెంటెడ్ పర్సన్.

Raghu Kunche: మల్టీ టాలెంటెడ్ పర్సన్.. ఐదు నందులు అందుకున్న ప్రతిభాశాలి రఘు కుంచె పుట్టిన రోజు నేడు
Raghu Kunche
Surya Kala
|

Updated on: Jun 13, 2021 | 8:07 AM

Share

Raghu Kunche : రఘు కుంచే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ మొత్తానికి మల్టీ టాలెంటెడ్ పర్సన్. బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టి.. స్వయం కృషితో తనకంటూ ఫేమ్ ను సంపాదించుకున్నాడు రఘు కుంచె. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో పనిచేశాడు.. అంతేకాదు.. వివిధ విభాగాల్లో ఏపీ ప్రభుత్వం నుంచి ఐదు నందులు అందుకున్న ప్రతిభాశాలి రఘు కుంచె పుట్టిన రోజు నేడు.. ఆయనకు శుభాకాంక్షలతో..

రఘు కుంచె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని గాదరాడ. కోరుకొండలో ఉన్నత విద్యనభ్యసించాడు. చిన్నప్పటి నుంచి రేడియోలో వచ్చే పాటలను వింటూ.. సాధన చేస్తూ.. పాఠశాల స్థాయి నుంచి పాటల పోటీల్లో పాల్గొన్నాడు. అనేక బహుమతులు అందుకున్నాడు. ఇక కాలేజీలోకి అడుగు పెట్టక నీ గొంతు బాగుంది.. సినిమాల్లో ప్రయత్నించు అనడంతో భాగ్యనగరం బాట పట్టాడు.

రైలులో పరిచయమైన ఈసీఐఎల్ ఉద్యోగి రాధాకృష్ణ సహాయంతో సికింద్రాబాదులోని ఒక సంగీత కళాశాలలో చేరాడు. మరోవైపు సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ స్నేహం కుదరడంతో ఒకే గదిలోకి మారారు. అంతేకాదు అవకాశాల కోసం ఇద్దరూ ప్రయత్నించేవారు.. అలా రఘు అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో నువ్వు ఇతరగాయకులను అనుకరిస్తున్నావు అంటూ తిరస్కరించారు. దీంతో సొంతంగా పాటలు రాసుకుని బాణీలు కట్టడం ప్రారంభించాడు.

జీ.కే మోహన్ అనే స్నేహితుడు విజేత అనే టెలీఫిల్మ్ లో రఘుకు హీరోగా అవకాశం వచ్చింది. అలా బుల్లి తెరకు రఘు పరిచమయ్యాడు. ఇదే టెలీఫిల్మ్ ద్వారా ఝాన్సీ కూడా బుల్లితెరకు పరిచయమైంది. తర్వాత మరిన్ని అవకాశాలను బుల్లి తెరపై అందుకున్నాడు. అదే సమయంలో రఘు కుంచెకు ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో యాంకర్ గా చేసిన యువర్స్ లవింగ్లీ కి మంచి పేరు వచ్చింది. అనంతరం స్మాల్ స్క్రీన్ పై పోస్ట్‌బాక్స్‌ నెం 1562, సాంగుభళా, అంత్యాక్షరి వంటి అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది.

బుల్లితెరపై వ్యాఖ్యాతగా బిజీగా ఉన్నా.. వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా రఘు కుంచె వదులుకోలేదు.. నటుడిగా కొనసాగుతున్న రఘుకు పూరి జగన్నాథ్ బాచి సినిమా లో సంగీతం లచ్చిమీ లచ్చిమీ అనే పాట పడే అవకాశం వచ్చింది. ఆ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అనంతరం రవితేజ ఇడియట్ , చిరంజీవి హీరోగా నటించిన మృగరాజు , దేశముదురు, శివమణి వంటి సినిమాల్లో పాటలను పాడాడు.. మరో పక్క వినీత్, అబ్బాస్, అరవింద్‌ స్వామి, దీపక్‌ లాంటి చాలామందికి డబ్బింగ్‌ కూడా చెప్పాడు. సంపంగి సినిమాకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

ఓ వైపు వెండి తెరపై వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే.. మరోవైపు బుల్లి తెర కార్యక్రమాలకు సంగీతం చేకూర్చడం మొదలు పెట్టాడు. అక్కడా నంది అవార్డును అందుకున్నాడు. తొలిసారిగా బంపర్ ఆఫర్ సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో అవకాశం అందుకున్నాడు. ఆ సినిమాలో రఘు పాడిన పెళ్ళెందుకే రవణమ్మా అనే పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది. అదే సినిమా సంగీత దర్శకుడిగా నంది అవార్డు లభించింది. అహ నా పెళ్ళంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌, దొంగాట లాంటిసినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. నాయకి సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగుతో పాటు తమిళంలోనూ అడుగుపెట్టాడు. కన్నడలో రెండు సినిమాలు చేశాడు. కరుణ అనే నృత్యకళాకారిణిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు రఘు ఈ దంపతులకు ఒక పాప రాగ పుష్యమి. ఒక బాబు. ఇటీవలే రాగ పుష్యమికి పెళ్లి కూడా చేశాడు రఘు.

Also Read: పసిడి ప్రియులకు శుభవార్త ఈరోజు కొంతమేర దిగివచ్చిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర