Karthika Deepam: ఓ వైపు తాను మరణించినట్లు కలగన్న మోనిత.. మరోవైపు దీప పిల్లలు తప్ప ఇంకెవరూ వద్దంటున్న కార్తీక్

Karthika Deepam : దీప ఆలోచిస్తుంటే.. అమ్మా అంటూ హిమ, శౌర్య లు వస్తారు. పిల్లని దిగబెట్టడానికి వచ్చి ఉంటారుఅని ఆలోచిస్తుంటే.. కార్తీక్ .. పిలల్లు దీపని ఇంటికి తీసుకొస్తే బాగుండును.. ఇప్పుడు..

Karthika Deepam: ఓ వైపు తాను మరణించినట్లు కలగన్న మోనిత.. మరోవైపు దీప పిల్లలు తప్ప ఇంకెవరూ వద్దంటున్న కార్తీక్
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2021 | 12:19 PM

Karthika Deepam:దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫేవరేట్ సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ కార్తీక దీపం సీరియల్ కు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అభిమానులే. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీక్ దీపం సీరియల్ ఈరోజు 1064 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది.ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

తల్లి ఇంట్లో లేదని తెలిసి తండ్రిని హిమ, శౌర్యలు నిలదీస్తారు. అమ్మని చూస్తే అందరూ అయ్యోపాపం అంటారు.. నీకు జాలి వెయ్యలేదా డాడీ అని ప్రశ్నిస్తుంది హిమ. అమ్మనే కాదు మమ్మల్ని చూసినా మీకు జాలిగా అనిపించదా చిన్నప్పుడు నాకు అమ్మ ఒక్కటే నాన్న లేదు.. హిమ కి అమ్మలేదు నాన్నా ఒక్కడే.. ఎప్పుడు మాకు మాకు ఆమ్మో నాన్నో ఎవరో ఒకరే చాయిస్ నాన్నా .. అందరం కలిసి ఉండే అదృష్టం లేదా నాన్నా ని శౌర్య ప్రశ్నిస్తుంది.. కార్తీక్ పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని దీప దగ్గరకు బయలుదేరతాడు.

ఫోన్ లో పిల్లల ఫోటోలు చూసి సంతోష పడుతున్న మోనిత దగ్గరకు ప్రియమణి పాలు తీసుకుని వస్తుంది. అప్పుడు రేపటి నుంచి కూరల్లో ఉప్పు, కారం, మసాలా తగ్గించు ఏ వంటలు చేయాలో నేను లిస్ట్ రాసిస్తా అవి వండు.. నా బిడ్డకు మంచిది అంటుంది మోనిత.. అప్పుడు ప్రియమణి అమ్మా నిజంగా మీరు కడుపుతో ఉన్నారా.. లేదంటే ఇది కూడా నాటకమేనా అని అంటుంది ప్రియమణి.. దీంతో మోనిత కోపంతో ఎం మాట్లాడుతున్నావే.. నేను నాటకాలు వేసేదానిలా కనిపిస్తున్నానా? నేను కడుపుతో ఉన్నాను అనేది నిజం.. నా ఈ కడుపుకి మీ కార్తీక్ అయ్యే కారణం అన్నది ఇంకా పచ్చినిజం.. అంతే కానీ.. నేను వేరే వాడితో తిరిగి. అంటుంటే ప్రియమణి నా ఉద్దేశ్యం అది కాదు అంటుంది.. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకంటూ అక్కడనుంచి వెళ్లిపొమ్మంటుంది ప్రియమణిని.

దీప ఆలోచిస్తుంటే.. అమ్మా అంటూ హిమ, శౌర్య లు వస్తారు. పిల్లని దిగబెట్టడానికి వచ్చి ఉంటారుఅని ఆలోచిస్తుంటే.. కార్తీక్ .. పిలల్లు దీపని ఇంటికి తీసుకొస్తే బాగుండును.. ఇప్పుడు పిల్లల ముందు మోనిత గురించి అడుగుతుందా.. అలాంటి పనిచేసేది దీప కాదు అంటూ ఆలోచిస్తాడు.. ఇంతలో శౌర్య హిమలూ.. ఎందుకు ఇంటి నుంచి వచ్చేశావమ్మా .. మళ్ళీ కాలుష్యం అంటారే అది మీ ఇద్దరి మధ్యకు వచ్చిందా అని శౌర్య అడుగుతుంది.. దీప మనసులో నా దగ్గర ఎప్పుడూ కాలుష్యం లేదు.. ఇప్పుడు కలిష్యం అంతా మీ నాన్నదగ్గరే ఉంది అనుకుంటుంది.

ఎందుకొచ్చావు మళ్ళీ వంటలు చేస్తావా.. బట్టలు కుడతావా అని అడుగుతున్న పిల్లలతో అదేమీ లెదమ్మా నాకు అంత పెద్ద ఇంట్లో కంఫర్ట్ గా ఉండడం లేదు.. అంటే డాడీ కి ఇక్కడ కంఫర్ట్ ఉండదు కాదమ్మా అంటుంది హిమ.. అది మీ డాడీ డిసైడ్ చేసుకోవాలి.. ఎక్కడ ఆయనకు నచ్చితే అక్కడ ఉండొచ్చు అంటుంటే.. నీతో మాట్లాడాలి దీప అంటాడు కార్తీక్…. శౌర్య టీచర్ చెప్పేది.. పిల్లి ఆరు నెలల వరకూ తన పిల్లలని ఇల్లు మారుస్తూ ఉంటుందట.. వాటికీ పూర్తిగా నడక వచ్చే వచ్చేకా మీ ఫుడ్ మీరు తినండి అంటూ వదిలేస్తుందట ఇంతలో కార్తీక్ దీపని భోజనం చేశావా అని అడుగుతాడు.. ఊఁ అంటుంది దీప.

కార్తీక్ వంటింట్లోకి వెళ్లి అక్కడ భోజనం ఉండడం చూసి దీప అన్నం తినలేదని అర్ధం చేసుకుంటాడు.. మళ్ళీ పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళని నిద్రపోమని చెబుతాడు.. తాను ఎక్కడికి వెళ్లాలని ఇక్కడే ఉంటానని అంటదు.. ఇంతలో మోనిత ఉల్కిపడి లేస్తుంది.. ప్రియమణి అని పిస్తుంది. ప్రియమణి వచ్చి ఏమైందమ్మా అని అంటూ వస్తుంది. ఏమీ లేదు నిద్ర నిద్రపో అంటుంది మోనిత. నేను పురిటి నొప్పులతో మరణించినట్లు కల వచ్చింది ఏమిటి.. ఈ కల ఎందుకు వచ్చింది.. అయినా మరణించినట్లు కల వస్తే మంచి జరుగుతుంది అంటారు.. అయినా నేను అంత త్వరగా ఎందుకు చస్తాను.. నేను అనుకున్నట్లు కార్తీక్ తో కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటాను నవ్వుకుంటుంది.

దీప కు కార్తీక్ అన్నం కలిపి ముద్దలు పెడతాడు.. నేను నటించడం లేదు దీప.. నాకు అసలు నటించడం చేతకాదు.. మనసుకు అనిపించింది పైకి అనేస్తాను.. లోలోపల ఏదీ దాచుకోను.. కార్తీక్ అనే ఖచ్చితం.. కార్తీక్ అంటే స్పష్టత.. కార్తీక్ చదివే రోజుల్లో తోటి విద్యార్థుల్లో గౌరవం.. కార్తీక్ అంటే క్యారెక్టర్ అందరికీ నేనంటే ఇష్టం.. కానీ నేను హిమని ఇష్టపడ్డాను.. ఆమెనే నా జీవిత భాగస్వామిని చేసుకోవాలని అనుకున్నా.. హిమ నాకు దక్కలేదు కొన్నాళ్ళు పిచ్చివాడి అయ్యాను జీవితంలో పెళ్లి అనే మాట లేదు అనుకున్నా.. నిన్ను చేసేవరకూ నీ ఆత్మ సౌందర్యం నాకు నచ్చి హిమ తర్వాత ఇష్టపడింది నిన్నే.. నిన్ను కోడలుగా అమ్మ అంగీకరించాడని తెలిసినా.. అమ్మని ఒప్పించవచ్చు అని నీ మేడలో తాళి కట్టాను. కోరుకున్న అమ్మాయి భార్యగా వచ్చినందుకు సంతోష పడ్డాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోష పడ్డా.. దేవుడు అందరికీ అన్ని ఇవ్వరు నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యింది.. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నువ్వు దూరం అయ్యావు.. మళ్ళీ దగ్గర అయ్యావు.. నిజం చెబుతున్నా దీప నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు. అంటాడు కార్తీక్. నువ్వు పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవడును ఏది ముఖ్యం కాదు దీప అంటుంటే పిల్లలు సంతోషంగా చూస్తారు.. నాకు నువ్వు కావాలి పిల్లలు కావాలి అంతకంటే ఏమీ వద్దు అంటాడు కార్తీక్.. కానీ దీప ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది..

Also Read: మనం రోజూ నీరుని ఎలా ఏ సమయంలో తాగాలో హార్ట్ స్పెషలిస్ట్ చ్ చెప్పిన ఆరోగ్య సూత్రాలు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?