Snoring Remedies: గురక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా… ఈ సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు

Snoring Remedies: స్థూలకాయం ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందిని పడే సమస్య గురక. ఈ గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి..

Snoring Remedies: గురక సమస్యతో  ఇబ్బందులు పడుతున్నారా... ఈ సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు
Snoring
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2021 | 2:46 PM

Snoring Remedies: స్థూలకాయం ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందిని పడే సమస్య గురక. ఈ గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఈ గురకను సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు..

*గ్లాసు నీటిలో 1—2 పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి. *కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ను చేతివేళ్ళకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది. *1/2 టీ స్పూను ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూను తేనె కలిపి రాత్రి నిదురపోయేముందు తాగాలి. *మరిగే నీటిలో 4లేదా5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిదురపోయే ముందు 10ని” పాటు ముక్కుద్వారా ఆవిరి పీల్చాలి. *ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడిచేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాలలో పోసి పీల్చుతుంటే గురక తగ్గుతుంది. *1/2టీ స్పూను యాలకుల చూర్ణంను ఒక గ్లాసు వేడీనీటిలో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి. *రెండు టీ స్పూనుల పసుపుపొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.

Also Read: 100 కేజీల దాటి బరువున్న భారీ కాయులు అద్దెకు కావాలంటూ నోటిఫికేషన్ ఎక్కడంటే..