Chiranjeevi: త్వరలో కోవిడ్ బాధితుల కోసం మరో సేవా కార్యకమానికి మెగా శ్రీకారం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సామజిక కార్యక్రమాలను నిర్వహించడంలో కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడడంలో ముందుటారు. తన అభిమానులను కలుపుకుని మెగా హీరోలు..

Chiranjeevi: త్వరలో కోవిడ్ బాధితుల కోసం మరో సేవా కార్యకమానికి మెగా శ్రీకారం
Megastar Chiranjeevi
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2021 | 12:48 PM

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సామజిక కార్యక్రమాలను నిర్వహించడంలో కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడడంలో ముందుటారు. తన అభిమానులను కలుపుకుని మెగా హీరోలు సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లు వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది బాధితులకు చిరంజీవి అండగా నిలిచారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ సాయం అందిస్తుంటారు మెగా హీరోలు.. ఇక కరోనా కష్ట కాలంలోనూ మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు సాయం అందిస్తూనే ఉన్నారు.

ఎప్పుడో నేత్రదానం, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి లాక్ డౌన్ సమయంలో సీసీసీ అనే సంస్థను ప్రారంభించి ఇతర సినీ తారల సపోర్ట్‌తో సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు. అంతేకాదు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్​తో ముందుకొచ్చారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం ఈ సేవల్ని తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో సామజిక కార్యక్రమంతో చిరంజీవి ప్రజల ముందుకు రాబోతున్నరని సమాచారం. అంబులెన్స్ సర్వీసులను స్టార్ట్ చేయబోతున్నారట. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ఈ అంబులెన్స్ సర్వీస్​ను చిరంజీవి ప్రారంభించనున్నారట. అపోలో హాస్పిటల్స్ సహా ఇతర ప్రైవేటు హాస్పిటల్స్ సహకారంతో ఈ సేవలను అందించడానికి చిరంజీవి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే చిరు దీనిపై ప్రకటన చేయబోతున్నారని సమాచారం.

Also Read: ఓ వైపు తాను మరణించినట్లు కలగన్న మోనిత.. మరోవైపు దీప పిల్లలు తప్ప ఇంకెవరూ వద్దంటున్న కార్తీక్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?