Karthi: హీరో కార్తీ మంచి మనసు.. కూచిపూడి కళాకారులకు అండగా నిలిచిన హీరో.. 50 మందికి ఆర్థిక సాయం…
కరోనా రెండో దశ యావత్ భారతాన్ని అతాలకుతలం చేసింది. అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది.
కరోనా రెండో దశ యావత్ భారతాన్ని అతాలకుతలం చేసింది. అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది. పలు కంపెనీలు మూతపడగా.. ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈ మహమ్మారి ప్రభావం.. అటు సినీ పరిశ్రమపై ఎక్కువగానే పడింది. గాతేడాది నుంచి సినీ షూటింగ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవల కొద్ది నెలలు సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభమవగా.. అటు థియేటర్లు కూడా 50 % ఆక్యుపెన్సీతో ఓపెన్ చేశారు. దీంతో బడా హీరోలు సైతం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. కానీ కరోనా రెండో దశ మరోసారి సినీ ఇండస్ట్రీని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా.. సినిమా షూటింగ్స్ నిలిచిపోగా.. థియేటర్లు మళ్లీ మూత పడడంతో.. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలోనే వారిని ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. తాజాగా హీరో కార్తీ కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు ఆయన రూ. లక్ష సాయం అందించారు. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలు విజ్ఞప్తి మేరకు కార్తీ ముందుకు వచ్చారు. గతేడాది కూడా ఈ సాయాన్ని అందించాలనుకున్న కార్తి.. కొన్ని కారణాలతో సహాయం అందించలేకపోయాడు. ఆ లక్ష్యాన్ని ఈ ఏడాది పూర్తి చేసుకున్నాడు. 50 మంది కళాకారులకు ఆ డబ్బును వారి అకౌంట్లలోకి జమ చేసినట్లుగా భావన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు.
Esha Rebba: మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయి.. అరవింద్ స్వామి సినిమాలో ఈషా..
Monsoon Skin Diet: వర్షాకాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చిట్కాలను పాటించండి..