AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immune System: ఈ ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. మీ రోగనిరోధక శక్తి ఖచ్చితంగా తగ్గిపోతుంది.! జర జాగ్రత్త..

అసలే కరోనాకాలం.. ఆపై దంచికొడుతున్న వర్షాలు.. దీనితో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇన్ఫెక్షన్ మన దరికి చేరకుండా..

Immune System: ఈ ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. మీ రోగనిరోధక శక్తి ఖచ్చితంగా తగ్గిపోతుంది.! జర జాగ్రత్త..
Immunity
Ravi Kiran
|

Updated on: Jun 12, 2021 | 10:13 AM

Share

అసలే కరోనాకాలం.. ఆపై దంచికొడుతున్న వర్షాలు.. దీనితో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇన్ఫెక్షన్ మన దరికి చేరకుండా చూసుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై చాలా అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే అంటువ్యాధులను ధీటుగా ఎదుర్కోవచ్చు. అలాగే, సంక్రమణ ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఇదిలా ఉంటే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎన్నో మార్గాలు, పలు రకాల వంటింటి చిట్కాలు ఉన్నాయి. అయితే మీ డైలీ రొటీన్ జీవితంలో రోగ నిరోధకశక్తిని బలహీనపరిచే ఆహార పదార్ధాలను తీసుకుంటున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? మరి అవేంటో చూద్దాం పదండి.!

చక్కెరతో కాఫీ..

మీరు ప్రతీరోజూ తాగే కాఫీలో షుగర్ కంటెంట్ ఎక్కువైతే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాఫీలో ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే CRP, IL-6 వంటి తాపజనక ప్రోటీన్లు వృద్ది చెందుతాయి.

ఉప్పు అధిక వినియోగం..

చిప్స్, బేకరీ ఐటమ్స్, డిసర్ట్స్ వంటి ప్యాకేజింగ్‌ ఆహార పదార్ధాలలో ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉప్పు అధికంగా వాడటం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఉప్పు రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. అందుకే మీ రోజూవారీ ఆహారంలో పరిమితంగా ఉప్పును తీసుకోవడం మంచిది.

ఫ్రైడ్ ఫుడ్..

వేయించిన ఆహారంలో అణువులు ఎక్కువగా ఉంటాయి. అవి అధిక మొత్తంలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఫ్రైడ్ ఫుడ్ రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందువల్ల, ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్ మొదలైనవి తినడం మానుకోండి.

కాఫీ ఎక్కువగా తాగడం..

కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నిద్ర, రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. అందుకే మీ రోగనిరోధక శక్తిని బలపరుచుకునేందుకు పరిమితి మోతాదులో కాఫీని సేవించాలని డాక్టర్స్ సూచిస్తారు.

ఆల్కహాల్..

తరచుగా మద్యం సేవించడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని చాలా అధ్యయనాలలో వెల్లడైంది.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!