SonuSood IAS: మ‌రో గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సోసూసూద్‌.. ‘సంభ‌వం’ పేరుతో ఉచితంగా ఐఏఎస్ కోచింగ్‌..

SonuSood IAS: క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో ఎంతో మందికి అండ‌గా నిలిచి ప్ర‌జ‌ల్లో గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు న‌టుడు సోనూసూద్‌. సినిమాల్లో విల‌న్‌గా న‌టించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం హీరోగా మారాడు...

SonuSood IAS: మ‌రో గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సోసూసూద్‌.. 'సంభ‌వం' పేరుతో ఉచితంగా ఐఏఎస్ కోచింగ్‌..
Sonusood Ias
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2021 | 2:39 PM

SonuSood IAS: క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో ఎంతో మందికి అండ‌గా నిలిచి ప్ర‌జ‌ల్లో గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు న‌టుడు సోనూసూద్‌. సినిమాల్లో విల‌న్‌గా న‌టించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం హీరోగా మారాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అడిగింది లేద‌నకుండా ఇస్తూ క‌లియుగ క‌ర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూ.. తాజాగా మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాడు. ఐఏఎస్ కావాల‌ని ఆశ‌తో ఉండేవారికి అండ‌గా నిలవ‌నున్నాడు.

ఇందులో భాగంగా.. ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై సోనూ ట్వీట్ చేస్తూ.. ‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సేవ‌ల‌ను అందిపుచ్చుకునేందుకు గాను ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు జూన్ 30లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ లింక్‌ల‌ను సోనూసూద్ ట్విట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇలా ఎన్నో కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటోన్న సోనూసూద్‌ను ప‌ద్మ అవార్డుల‌కు నామినేట్ చేస్తూ కేంద్రానికి పెద్ద ఎత్తున సిఫార్సులు అందుతున్న విష‌యం తెలిసిందే.

సోనూసూద్ చేసిన ట్వీట్‌..

Also Read: 100 కేజీల దాటి బరువున్న భారీ కాయులు అద్దెకు కావాలంటూ నోటిఫికేషన్ ఎక్కడంటే..

Covid19 Vaccine: దేశవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్.. దిగివస్తున్న కరోనా కేసులు.. ఇప్పటికి ఎంతమందికి టీకా అందిందంటే..!

Samudrik Shastra : కాలి బొటన వేలు కంటే మధ్యవేలు పొడవుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..? మీరు ఊహించలేని నిజాలు..