Samudrik Shastra : కాలి బొటన వేలు కంటే మధ్యవేలు పొడవుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..? మీరు ఊహించలేని నిజాలు..
Samudrik Shastra : సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కాలి వేళ్ల ఆకారాన్ని చూడటం ద్వారా వారి జీవితం గురించి తెలుసుకోవచ్చు.
Samudrik Shastra : సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కాలి వేళ్ల ఆకారాన్ని చూడటం ద్వారా వారి జీవితం గురించి తెలుసుకోవచ్చు. మీరు గమనించినట్లుగా చాలా మందికి కాలి బొటన వేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉంటుంది. ఇది అదృష్టంగా భావించండి. ఒక వ్యక్తి పాదాల ఆకారాన్ని గమనించి అతని ప్రవర్తన, జీవితం గురించి అంచనా వేస్తారు.
1.రెండో వేలు పెద్ద వేళి కంటే పొడవుగా ఉంటే.. రెండో వేలు పెద్ద వేళి కంటే పొడవుగా ఉంటే దాన్ని గ్రీక్ ఫూట్ అంటారు. ఇలాంటి వేలు ఉన్నవాళ్లు కళాత్మకంగా, స్పోర్టీవ్ గా ఉంటారు. వీళ్లు చాలా ఉత్సాహభరితంగా ఉంటారు. ఇతరులను మోటివేట్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్లకు ఎక్కువగా దూకుడు స్వభావం ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి.
2. మొదటి మూడు వేళ్లు ఒకే పొడవు ఉంటే.. మొదటి మూడు వేళ్లు ఒకే పొడవు ఉంటారు. తర్వాత రెండు వేళ్లు సమాన పొడవు ఉంటాయి. పెద్ద వేలి నుంచి మిగిలిన వేళ్లు 45 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఇలాంటి కాలి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీళ్లు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందులో ఎక్కువగా ప్రదేశాలు, సాంప్రదాయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కనపరుస్తారు.
3. బొటనవేలు పెద్దగా దీర్ఘచతురస్రాకారాన్ని సూచిస్తుంటే.. బొటనవేలు పెద్దగా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారాన్ని సూచిస్తుంది. దీన్ని రైస్ ఫూట్ అని కూడా పిలుస్తారు.అన్ని వేళ్లు సమానమైన పొడవు కలిగి ఉంటే.. స్క్వేర్ ఫూట్ అంటారు. ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆచు తూచి ఆలోచనలు తీసుకుంటారు.
4.వేళ్ళు ఒకదానికొకటి అతుక్కొని ఉంటే.. టాపింగ్ ఫూట్, సన్నగా పొడవుగా ఉంటుంది. వేళ్ళు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. బొటనవేలు అన్నింటికంటే పెద్దగా కనబడుతుంది. ఈ రకమైన పాదాలు కలిగిన వ్యక్తులు చాలా గోప్యంగా వ్యవహరిస్తారు. వీరిలో హఠాత్తుగా, ఆకస్మికంగా మనస్సు మార్చుకుంటారు.